Take a fresh look at your lifestyle.

సివిల్స్ నియామకాల ప్రక్రియ నిడివి తగ్గించాలి

0 182

సివిల్స్ నియామకాల ప్రక్రియ నిడివి తగ్గించాలి

  •  పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ,  మార్చి 27 : సివిల్స్ నియామకాల ప్రక్రియను 15 నెలలపాటు కొనసాగించడం వల్ల అభ్యర్థుల జీవితంలో కీలకమైన సమయం వృథా అవడంతోపాటు, వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.

నియామక ప్రక్రియ నిడివి తగ్గించాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)కి సూచించింది. సివిల్స్‌ పరీక్షలకు చాలా తక్కువ మంది హాజరవడానికి కారణాలను పరిశీలించాలని నిర్దేశించింది.

ఐఏఎస్‌, ఐఎ్‌ఫఎస్‌, ఐపీఎస్‌ తదితర అధికారుల నియామకానికి యూపీఎస్సీ ఏటా ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. దీనిపై సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఓ నివేదికను రూపొందించింది.

ఆ నివేదికను ఇటీవలే పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
యూపీఎస్సీ అందజేసిన సమాచారం ఆధారంగా నోటిఫికేషన్‌ విడుదల నుంచి తుది ఫలితాల ప్రకటన వరకు సుమారు 15 నెలల సమయం తీసుకుంటున్నట్టు అర్థమవుతోందని ఆ నివేదికలో పేర్కొంది.

‘ఏదేని నియామక ప్రక్రియ సాధారణంగా 6 నెలలు మించకూడదు.

అభ్యర్థుల జీవితంలో కీలకమైన సంవత్సరాలు వృథా కాకూడదని కమిటీ అభిప్రాయపడుతోంది. ఆ మేరకు నాణ్యతలో రాజీపడకుండానే నియామక ప్రక్రియ వ్యవధిని గణనీయంగా తగ్గించాలి’ అని పార్లమెంటరీ కమిటీ సూచించింది.

ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని సివిల్స్‌ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక విడుదల చేస్తున్నారని, ఇది అభ్యర్థులను నిరుత్సాహానికి గురిచేస్తోందని, పారదర్శకతలో రాజీకి ఆస్కారమిస్తోందని ఈ సందర్భంగా కమిటీ ఆక్షేపించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking