Take a fresh look at your lifestyle.

సివిల్స్ విజేతల ఆలోచన వంద బాలికల భవిష్యత్ కు భరోసా..

ఉన్నతమైన ఆలోచనలు ఇతర జీవితాలకు మార్గం చూపుతాయనేది నిజం. ఇగో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి  యూపిఎస్ సీ – 2024 లో విజేతలుగా నిలిచిన నవ యువత కూడా ఉన్నతులుగా ఆలోచన చేశారు. నిరు పేదల బాలికల భవిష్యత్ గురించి ఆలోచన చేశారు. ఆ సివిల్స్ విజేతల ఆలోచనల నుంచి వచ్చిందే ‘‘సుకన్య సమృద్ధి యోజన పథకం’’...

0 1,287

సివిల్స్ విజేతల ఆలోచన

వంద బాలికల భవిష్యత్ కు భరోసా..

  • పోస్ట్ ఆఫీస్ లో సుకన్యసమృద్ధి యోజన పథకం ఖాతాలు..

ఉన్నతమైన ఆలోచనలు ఇతర జీవితాలకు మార్గం చూపుతాయనేది నిజం. ఇగో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి  యూపిఎస్ సీ – 2024 లో విజేతలుగా నిలిచిన నవ యువత కూడా ఉన్నతులుగా ఆలోచన చేశారు. నిరు పేదల బాలికల భవిష్యత్ గురించి ఆలోచన చేశారు. ఆ సివిల్స్ విజేతల ఆలోచనల నుంచి వచ్చిందే ‘‘సుకన్య సమృద్ధి యోజన పథకం’’.

సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రభుత్వ-మద్దతుగల చిన్న పొదుపు పథకం.  ఇది తల్లిదండ్రులు తమ ఆడపిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పథకాన్ని పోస్టాఫీసుల్లో సులభంగా తెరవవచ్చు.  అమ్మాయి పేరు మీద సేవింగ్స్ ఖాతా రూపంలో ప్రైవేట్ లేదా పబ్లిక్ బ్యాంకులలో ఎక్కౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల డబ్బులు జమ చేస్తే పిల్లల భవిష్యత్ కు భరోసా ఇస్తోంది ‘‘సుకన్య సమృద్ధి యోజన పథకం’’..  

           యుపిఎస్ సి – 2024లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది విజేతలుగా నిలిచారు. వాళ్లంతా రాబోయే కాలంలో పేదల అభ్యున్నతి కోసం ఉన్నతాధికారులుగా సేవలందించాల్సి ఉంది. అయితే.. పేదల అభివృద్ది కోసం ఏదైనా చేయాలనే ఆలోచణకు ‘‘సుకన్య సమృద్ధి యోజన పథకం’’ సివిల్స్ విజేతలకు గుర్తుకు వచ్చింది.

అంతే.. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని పోస్ట్ ఆఫీస్ లో హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టీ.ఎం. శ్రీలత ఐ.పీవో.ఎస్ ఆధ్వర్యంలో ‘‘స్పూర్తి’’ ప్రోగ్రాం నిర్వహించారు. సివిల్స్ విజేతల సహాకారంతో 100 మంది నిరు పేద బాలికలకు ‘‘సుకన్య సమృద్ధి యోజన పథకం’’ ఖాతాలను తెరిపించి ఒక్కో ఖాతలో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశారు. సివిల్స్ విజేతల ఆలోచనలతో వంద మంది నిరుపేద బాలికల జీవితాలకు భరోసా దొరికింది.

పేదల కోసం సివిల్స్ విజేతల ఆలోచనలు

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి 60 మందిమి సివిల్స్ విజేతలుగా ఎంపికయ్యాం. తాము పేదలకు సహాయం చేయాలని నిర్ణయించాం. ‘‘సుకన్య సమృద్ధి యోజన పథకం’’ గుర్తుకు వచ్చి పోస్టల్ డిపార్ట్ మెంట్ వారితో చర్చించాం. వంద మంది పేద బాలికలకు పోస్ట్ ఆఫీస్ లో ఎక్కౌంట్ లు తెరిపించాం. ఒక్కో ఖాతలో వెయ్యి రూపాయలు డిపాజిట్ చేశం.. బాలికలు డబ్బుల ఇబ్బందులతో తమ కలలు కల్లలు చేసుకోవద్దని ఈ సహాయం చేసి ప్రతి పేరేంట్ కూడా నెల నెల డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పాం. సివిల్స్ విజేతలుగా తాము భవిష్యత్ లో పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తాం..

  • అనన్య రెడ్డి, సివిల్స్ విజేత

పేదల పిల్లలు భవిష్యత్ లో కలెక్టర్ లుగా.. ఎస్ పీలుగా.. డాక్టర్ లుగా.. టీచర్ లుగా ఇలా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆ సివిల్స్ విజేతలు ఆకాంక్షించారు. ఈ ప్రోగ్రాంలో ఐఆర్ఎస్ ఆఫీసర్ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ సత్యనారాయణ, డి ఆర్ నరసింహారావు, ఎఎస్పీ నాగేందర్, సుధాకర్ రెడ్డి, కె. అనంత్ రాం కిషన్ రాం, ఐపి వై. వినయ్ శ్రీకాంత్, పోస్టల్ అసిస్టెంట్స్, బాలికల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సివిల్స్ లోనూ టాప్.. పేదల అభ్యున్నతి కోసం ఆలోచనలోనూ టాప్..  ఆ విజేతలకు ‘‘నిర్దేశం’’ కంగ్రాట్యులేషన్ చెబుతుంది.

యాటకర్ల మల్లేష్

యాటకర్ల మల్లేష్,

సెల్ : 9394 22 5111

Leave A Reply

Your email address will not be published.

Breaking