Take a fresh look at your lifestyle.

ఆ వృద్ద దంపతుల మానవత్వం.. నేటి యువతకు ఆధర్శం..

0 22

స్పూర్తి కథనం..

ఆ వృద్ద దంపతుల మానవత్వం..

  • అనాధశ్రమంలో వాళ్ల మ్యారేజ్ డే..

  • అన్నీ పనులు తామే చేసుకుంటే ఆరోగ్యంగా..

‘‘విష్ యు హెప్పి మ్యారేజ్ డే..’’

అనసూయమ్మ – పాపరావు ఈ యంగ్ దంపతుల పెళ్లై సరిగ్గా 54 ఏళ్లు. వాళ్ల వయసు ఇప్పుడు 75 ఏళ్లు పాపరావుకు.. 70 ఏళ్లు అనసూయమ్మకు.. పొద్దున లేవగానే ఆ దంపతులకు ఫోన్ చేసి బంధువులు, శ్రేయోభిలాషులు ‘‘పెళ్లి రోజు శుభకాంక్షలు’’ చెబుతున్నారు.

‘‘గీ వయసులో మాకు మ్యారేజ్ డే.. ఎందుకు..’’ ఆలోచిస్తున్నారు ఆ దంపతులు.

కానీ.. వాళ్ల ఆలోచనలు పుల్ స్టాప్ పెడుతూ వెస్ట్ మ్యారేడ్ పల్లిలోని ‘‘ఓరల్ స్కూల్ ఫర్ డీప్’’ అనాధశ్రమం గుర్తుకు వచ్చింది.

‘‘మన పెళ్లి రోజు అనాధలకు మంచి బోజనం పెడుదాం..’’ అనుకున్నారు ఆ దంపతులు.

అంతే.. ఆ దంపతులు ఇద్దరే బోజనం తయారు చేసుకుని ‘‘ఓరల్ స్కూల్ ఫర్ డీప్’’ అనాధశ్రమంకు వెళ్లారు. ఆ పిల్లలతో ఎంజాయ్ చేశారు. ఆ అనాధ పిల్లల సమక్షంలోనే ‘‘మ్యారేజ్ డే’’ కేక్ కట్ చేశారు.

ఆ దంపతులు నేటి యువతకు ఆధర్శం

హైదరాబాద్ లోని అళ్వాల్ లో అనసూయ – పాపరావు దంపతులు ఇద్దరే ఉంటారు. వాళ్లకు ఇద్దరు కుమారులు. కానీ.. ఒకరు అమెరికాలో.. మరోకరు హైదరాబాద్ లోని సూర్యనగర్ లో ఉంటారు. కూతురు వాణి కూడా తండ్రికి దగ్గరలోనే ఉంటుంది.

అయినా ఏడు పదులు నిండిన వయసులో కూడా ఆ దంపతులు యాక్టివ్ గా ఉంటారు. విశాలమైన భవనంలో ఆ ఇద్దరు అన్నీ పనులు తామే చేసుకుంటారు. మన పనులు మనం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అంటారు ఆ యంగ్ జంట.

Leave A Reply

Your email address will not be published.

Breaking