Take a fresh look at your lifestyle.

పేపర్ లీకేజ్ వ్యవహరంపై విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు

0 478

పేపర్ లీకేజ్ వ్యవహరంపై

విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు

హైదరాబాద్, మార్చి 31  (వైడ్ న్యూస్) పరీక్ష పేపరుల లీకేజ్ వ్యవహరం.. చిలికి చిలికి గాలి వానలా రాష్ట్ర ప్రభుత్వ పాలకుల మెడకు బిగుస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న పేపర్ లీకేజ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసి విచారణ ప్రారంభించిన విషయం విధితమే.

కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీకి ఈ పేపర్ లీకేజ్ వ్యవహరంతో సంబందాలు ఉన్నాయని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు ఈ పరీక్షల పేపర్ ల లీకేజ్ పైనే ఫోకాస్ పెట్టారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్ కు ఈ పేపర్ లీకేజ్ తో సంబంధం ఉన్నందున సిట్ విచారణ నామమాత్రంగా ఉంటుందని వారి ఆరోపణ. అయితే.. పేపర్ లీకేజ్ లో కీలక పాత్ర పోషించిన ప్రవీణ్, రాజశేఖర్ లతో పాటు 15 మందిని నిందితులుగా అరెస్ట్ చేసింది సిట్. వారిలో కొందరిని అదుపులోకి విచారిస్తున్నారు అధికారులు. 

పేపర్ లీకేజ్ వ్యవహరంలో ఈడీ విచారణ షురూ..

పేపర్ లీకేజ్ వ్యవహరంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం రంగ ప్రవేశం చేసింది. టీఎస్ పీఎస్ సి పరీక్షల నిర్వహణ లోపంతో పేపర్ లీకేజ్ చేసిన నిందితులు లక్షలాది రూపాయలకు అమ్ముకోవడంపై ఈడీ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 పేపర్ వాట్సాప్ లో న్యూజీలాండ్ పంపినందున ఈడీ అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

అయితే.. న్యూజిలాండ్ లకు గ్రూప్ 1 పరీక్షల పేపర్ వెళ్లినందున ఫారిన్ మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజుల నుంచి వరుసగా  సిట్ ఆఫీస్ కు వస్తున్న ఈడీ అధికారులు పేపర్ లీకేజ్ వ్యవహరంకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరీక్ష పేపర్ ల లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన వారిని అదుపులోకి తీసుకుని ఈడీ అధికారలు విచారణ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

డబ్బులు చేతులు మారితే ఈడీ స్వయంగా విచారణ చేయచ్చు..

పరీక్షల పేపరుల లీకేజ్ వ్యవహరంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అవినీతి జరిగినట్లు సమాచారం అందితే ఈడీ అధికారులు ప్రివేన్స్ అండ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రకారం దేశంలో ఎక్కడికైనా వెళ్లి విచారణ చేసే అధికారం వారికి ఉంది.

అయితే.. ఈ పరీక్షల పేపర్ లీకేజ్ ల వ్యవహరంలో కూడా ఈడీ అధికారులు స్వయంగా విచారణ చేయడం మీడియా దృష్టికీ వచ్చింది. సిట్ అధికారులు  కూడా నిస్వార్థంగా విచారణ చేస్తున్నప్పటికీ సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కేటీఆర్, కవిత, సంతోష్ రెడ్డి, హరీష్ రావులు ఈ పేపర్ లీకేజ్ వ్యవహరంలో పాత్ర ఉన్నట్లు ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నందున ఈడీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

ప్రశ్నించిన వారికి నోటీస్ లు..?

పేపర్ లీకేజ్ వ్యవహరంలో అవినీతి కోణంలో ప్రశ్నించిన బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లకు సిట్ అధికారులు నోటీస్ లు ఇవ్వడం కూడా రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఈ కేసును తొక్కి పెట్టడానికి నోటీస్ లు ఇచ్చినట్లు భావిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు పరువు నష్టం దావా వేస్తానని మంత్రి కేటీఆర్ లాయర్ నోటీస్ పంపడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏది ఏమైనా టీఎస్ పీఎస్ సి పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహరంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం విచారణలో ప్రభుత్వంలోని పెద్దలకు తలనొప్పిగానే మారిందంటున్నారు విశ్లేషకులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking