Take a fresh look at your lifestyle.

గవర్నర్ – సీఎంల మధ్య ముదిరిన వివాదం..

0 33

గవర్నర్ – సీఎంల మధ్య ముదిరిన వివాదం

ఎమ్మెల్సీ అదృష్టం ఎవరికో..?

  • ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు
  • డాక్టర్ మధుశేఖర్ కు కలిసొచ్చేనా..?

నిర్దేశం, హైదరాబాద్ :

రాష్ట్ర మంత్రి మండలి నామినేటెడ్ ఎమ్మెల్సీల పదవుల కోసం సిఫారసు చేసిన ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన నేపథ్యంలో కొత్తగా ఎవరికి అదృష్టం వస్తుందనేది సర్వత్రా చర్చానీయంశమైంది, దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం నెలన్నర క్రితం గవర్నర్ ఆమోదానికి పంపగా, చాలా రోజులు పెండింగ్ లో పెట్టి చివరకు తిరస్కరించారు. దీంతో ఆశవహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గవర్నర్ కోట కింద ప్రభుత్వం రెండేళ్లకోసారి ఇద్దరు పేర్లను ఎంపిక చేసి రాజ్ భవన్ కు పంపడం ఆనవాయితీగా వస్తోంది.

గతంలో ఎప్పుడు కూడా మంత్రి మండలి చేసిన సిఫారసులు తిరస్కరణకు గురి కాలేదు. కానీ తమిళిసై తనకున్న అధికారాలను వినియోగిస్తూ ముగ్గురి పేర్లను తిరస్కరించారు. మంత్రి మండలి సిపారసులు తిరస్కరించడమే గాకుండా ఎలాంటి వారిని నామినేట్ చేయాలో స్పష్టం చేశారు.

రాజకీయాలతో సంబంధం లేని అర్హులని సిఫారసు చేయాలని సూచించారు. రాజకీయాలతో సంబంధం లేని వారికి, సహకార ఉద్యమం, సాహిత్యం, కళలు, శాస్రసాంకేతిక రంగాలలో ప్రావీణ్యం, సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నవారికే ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అధికార పార్టీ తమ రాజకీయ ప్రయోజనాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

2005లో నిజామాబాద్ జిల్లా రేంజ్ డిఐజీగా హెల్త్ శిభిరంలో మాట్లాడుతున్న అంజనీకుమార్ యాదవ్ ( ప్రస్తుత డీజీపీ)

అందుకే ప్రతీసారి ఏ ప్రభుత్వమైన రాజకీయనాయకుల పేర్లనే సిఫారసు చేస్తుంది. అధికార పార్టీలో అనేక మంది ఆశావహులుంటున్నందున గవర్నర్ కోటా కింద సర్దుబాటు చేస్తుంది. గవర్నర్ ఇద్దరి పేర్లను తిరస్కరించినందున కొత్తగా మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేయాల్సి ఉంటుంది.

రెండేళ్ల క్రితం పాడి కౌసిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు ఉందని గవర్నర్ తిరస్కరించగా, రాజకీయ నాయకుడైన మధుసూదనాచారికి అవకాశం లభించింది. నెల, రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. అంతలోపు ఇద్దరిని నామినేట్ చేయాలి. లేకుంటే ఎన్నికలు ముగిసే వరకు వాయిదా పడుతుంది. ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం సిఫారసు చేయాల్సి ఉంటుంది.

డాక్టర్ మధుశేఖర్ కు కలిసొచ్చేనా..?

మంత్రి మండలి ఎవరిని ఎంపిక చేస్తుందనేది బీఆర్ఎస్ లో ఆసక్తి కరంగా మారింది. గతంలో ఒక ఎస్సీ, ఓసీ నాయకుడు ఎమ్మెల్సీగా రిటైర్ కాగా, వారి స్థానంలో ఎస్టీ, బీసీ నాయకుల పేర్లను ఎంపిక చేసి సిఫారసు చేసింది. ఇండియాన్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ కు అవకాశం వస్తుందనేది చర్చనీయాంశమైంది. డాక్టర్ మధుశేఖర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాలలో చేయూత స్వచ్చంద సంస్థ ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఉచిత శస్త్ర చికిత్సలు చేశారు. 23 ఏళ్లుగా సుమారుగా 40 వేల మంది పేదలకు వైద్య సేవలు అందించిన చరిత్ర డాక్టర్ కు ఉంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో పని చేసిన మధుశేఖర్ కు బీఆర్ ఎస్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వారా రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్ ను కలిశారు. గవర్నర్ కోటాలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ రావు ఎమ్మెల్సీ పదవి కాలం ముగిసినందున ఆ స్థానంలో మధుశేఖర్ కు అవకాశం లిభిస్తుందని భావించారు.

ఎస్టీ, బీసీ లకు ఇవ్వడం వల్ల ఎస్సీ అయిన మధుశేఖర్ కు అవకాశం రాలేదు. దీంతో ఐఐఎఫ్ డబ్లు చైర్మన్ పదవి ఇచ్చారు. సేవా నేపథ్యం ఉన్నందున డాక్టర్ మధుశేఖర్ కు ఎమ్మెల్సీ పదవికి అర్హత ఉందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఐఐఎఫ్ డబ్లు చైర్మన్ గా డాక్టర్ మధుశేఖర్ బాధ్యతలు స్వీకరించిన రోజు కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు డాక్టర్ మధుశేఖర్ కు  ఎమ్మెల్సీ పదవి వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking