Take a fresh look at your lifestyle.

టీచర్ మల్లికార్జున్ పై దాడి అమానుషం? : ప్రజాసంఘాలు

0 292

టీచర్ మల్లికార్జున్ పై దాడి చేసిన మతోన్మాద దుండుగలను వెంటనే శిక్షించాలని ఆర్మూర్ పట్టణంలోని యాల్ల రాములు మెమోరియల్ హాల్లో సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, డి.ఎస్.పి, సిపిఎం ఆధ్వర్యంలో సదస్సు బి. సూర్య శివాజీ ( న్యూ డెమోక్రసీ నాయకులు) అధ్యక్షతన నిర్వహించారు.

గురువును గౌరవంగా భావించే భారతదేశంలో దానికి ప్రతినిధులం అని చెప్పే హిందుత్వ మూకలు శాస్త్రీయ దృక్పథం పెంచుటకు కృషి చేస్తున్న మల్లికార్జున్ టీచర్ పై దాడి చేయడం అవమానకరం కావున దాడి చేసిన వారిపై చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మానవ హక్కుల వేదిక హెచ్ఆర్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రపాటి మాధవరావు కోరారు.

శాస్త్రీయ అవగాహన అభివృద్ధి చేయడం, హేతుబద్ధ ఆలోచనను, సంస్కరణను అభివృద్ధి చేయడం ప్రతి భారతీయుడు విధి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(h ) ఘోషిస్తుందని ఆయన తెలిపారు. రాజ్యాంగం ఆదేశించిన విధిని మల్లికార్జున్ సక్రమంగా నిర్వహించడమే నేరమేలా అవుతుందని మతోన్మాద మూకలను సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రశ్నించారు?

ఇలాంటి సందర్భంలో మతోన్మాద భావాజాలం వ్యతిరేకించే ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు ఏకం కావాలని, ఐక్య ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

డాక్టర్. పోచన్న టి పి టి ఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులపై దాడికి పాల్పడడం తప్పు అని వారిపై చర్యలు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వాధికారులను ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘించి, టీజర్ మల్లికార్జున్ని అవమానించి, దాడి చేయడం అమానుషమని పోచన్న అన్నారు.

ఈ సదస్సులో సిపిఐ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు,  డి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు మహిపాల్ ప్రసంగించారు. న్యూ డెమోక్రసీ నాయకులు ఖాజా మొయినుద్దీన్, ఎస్ రవి, వి బాలయ్య, మార్క్స్ సిపిఐ నాయకులు రహీమ్, గోపి డీఎస్పీ నాయకులు సుమన్, రాజేశ్వర్, పి డి ఎస్ యు. ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking