Take a fresh look at your lifestyle.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం : మంత్రి హరీశ్ రావు

0 17

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం

: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట్, మే 22 : దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మారింది. సీఎం కేసీఆర్ రైతుకు విలువ పెంచారు. సంక్షేమంలోనైనా., అభివృద్ధిలోనైనా సిద్ధిపేట నియోజకవర్గ వర్గాన్ని అన్నీ రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

నంగునూరు మండలం భాషాయిగూడెం -తిమ్మాయిపల్లి గ్రామంలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అకాల వర్షాలు, వడగండ్ల వానతో చేతికొచ్చే పంట నష్టపోతున్నదని, వానాకాలం పంట నెల ముందుకు జరపాలని రైతులకు హితవుపలికారు.

తిమ్మాయిపల్లి గ్రామంలో 40 లక్షలతో విలేజ్ ఫంక్షన్ హాల్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో దోమ్మాట నియోజకవర్గ పరిధిలో కలిసి ఉన్నపుడు ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, ఈ తొమ్మిదేళ్లలో గ్రామం నుంచి నర్మెట్ట, కొనాయపల్లి, వెంకటాపూర్, బంధారం గ్రామాలకు రహదారులు వేసుకున్నామని గుర్తు చేశారు. గ్రామంలో ప్రతీ వీధికి సీసీరోడ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు ఉండేవనీ, సీఎం కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాకపోతే 24 గంటలు కరెంటు, రైతుబంధు, రైతుభీమా, ఆసరా ఫించన్లు, రైతు పండించిన ధాన్యం ఒక్క గింజ లేకుండా కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని చెప్పుకొచ్చారు. గ్రామంలో ఇప్పటికే దాదాపు 28 లారీల ధాన్యం గ్రామం నుంచి వెళ్లిందని తెలిపారు.

ఈ గ్రామాన్ని పరిశుభ్రంగా నిలిపిన ఘనత గ్రామ ప్రజలదేనని, మీ భాగస్వామ్యంతో తిమ్మాయిపల్లి ఆదర్శ గ్రామంగా రాష్ట్ర స్థాయిలో పేరొందిందని పేర్కొన్నారు. పామాయిల్ తోటలు విరివిగా సాగు చేయాలని, ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తున్నదని రైతులంతా సద్వినియోగం చేసుకుని పామాయిల్ తోటలు పెంపకానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking