Take a fresh look at your lifestyle.

శ్రీవారి సేవలో తెలంగాణ ఆర్టిసీ ఎండి సజ్జనార్

0 92

శ్రీవారి సేవలో తెలంగాణ ఆర్టిసీ ఎండి సజ్జనార్

తిరుమల : తిరుమల శ్రీవారిని తెలంగాణా ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వీసీ సజ్జనార్ మాట్లాడుతూ…..రెండు తెలుగు రాష్ట్రాలు., టీఎస్ మరియు ఏపీఎస్ ఆర్టీసీలు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.

టీఎస్ఆర్టిసి ద్వారా టీటీడీ టిక్కెట్లని జారీ చేయడం శుభపరిణామమన్నారు. వచ్చే రోజుల్లో ఆర్టీసీ తరపున ఇస్తున్న టిక్కెట్ల కోటను పెంచాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ నుంచి సింగరేణి మైన్స్ దార్శనిని సైతం ప్రారంభించామన్నారు. మైనింగ్ ఎలా చేస్తారో చాల మందికి తెలియదని… విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందన్నారు.

సోమవారం నుంచి శుక్రవారం వరకు విద్యార్థులు… శని., ఆదివారాల్లో ప్రజలు అధికంగా సింగరేణికి వెళ్తున్నారన్నారు. 30 నుంచి 40 లక్షల మంది ఆర్టీసీ ద్వారా రోజుకు ప్రయాణిస్తున్నారని….టీఎస్ఆర్టీసీలోని 9 బస్సులలో రేడియో ప్రారంభించామన్నారు. రేడియోను అన్ని టీఎస్ ఆర్టీసీ బస్సులో తీసుకురానున్నామని పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీలో చాల మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. టీఎస్ ఆర్టీసీలో సైతం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking