Take a fresh look at your lifestyle.

తెలంగాణ సీఎం అభ్యర్థి ప్రవీణ్ కుమార్

0 15

తెలంగాణ సిఎం అభ్యర్థి ప్రవీణ్ కుమార్

బిఎస్ పి అధినేత్రి మాయవతి ప్రకటన

హైదరాబాద్, మే 7 : బడుగులు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉత్తరప్రదేశ్ వలే తెలంగాణలో బిఎస్పి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి. రాజ్యాంగాన్ని వద్దని చెప్పిన సీఎం కేసీఆర్ ను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. బిఎస్ పి సీఎం అభ్యర్థిగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని మాయవతి ప్రకటించారు. ఐపిఎస్ పదవికి రాజీనామా చేసి పేదల అభ్యున్నతి కోసం పోరాడుతున్నారని ప్రవీణ్ కుమార్ ను అభినందించారు.

తెలంగాణలో మన బహుజన రాజ్యం వస్తుందని నమ్ముతున్నానని మాయవతి అన్నారు. తెలంగాణకు చెందిన జి.కృష్ణయ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ హత్యకు కారణమైన హంతకుడిని బీహార్ ప్రభుత్వం విడుదల చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఎందకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు ఆమె.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్ లో మద్దతు ఇచ్చిన మొట్టమొదటి పార్టీ బిఎస్పి అన్నారు మాయవతి. యూపిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చాము. భూమి లేని పేదలకు ఉచితంగా భూమి పంచాము.

కానీ అక్కడ మన బిఎస్పి చేసిన కార్యక్రమాలను కెసి ఆర్ కాపీ కొడుతున్నారని విమర్శించారు మాయవతి. ఆ స్కీంలను కూడా అమలు చేయకుండా కేవలం పేపర్ మీదనే పెట్టారన్నారు దుయ్యబట్టారు ఆమె.

సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టి మరోసారి రాజకీయ స్వార్థం కోసం, ఓట్ల  కోసం సీం కేసీఆర్ చేస్తున్న కుట్రను ప్రజలు గుర్తించాలన్నారు మాయవతి. కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు అన్యాయం చేసింది బిసిల రిజర్వేషన్ల కోసం కమీషన్ వేయాలని అంబేడ్కర్ అడిగితే కాంగ్రెస్ ఒప్పుకోలేదని గుర్తు చేశారు ఆమె.

అంబేడ్కర్ కు భారత రత్న కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదన్నారు ఆమె. బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందన్నారు మాయవతి. ఉత్తరప్రదేశ్ లో బిఎస్పి పార్టీ బలహీనంగా లేదన్నారు. ఇప్పటికిప్పుడు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగితే బిఎస్పి గెలుస్తుందని పేర్కొన్నారు మాయవతి. ఈవిఎం పద్దతిలో ఎన్నికలు జరిగితే ఆధిపత్య పార్టీలకే న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఇవ్వాలని మరియు బిపి మండల్ కమీషన్ సిఫార్సులు అమలు చేయాలని బి ఎస్పి డిమాండ్ చేసి సాధించిందని తెలిపారు మాయవతి. నాకు ఆనాటి విపి సింగ్  ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తామన్నా సరే బిసి లకు రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉన్నానని తెలిపారన్నారు ఆమె. బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సభకు అధ్యక్షత వహించారు. తెలంగాణ రాష్ట్ర నాలు మూలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తెలంగాణ భరోసా సభకు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking