Take a fresh look at your lifestyle.

గద్దర్ కు కవితల కన్నీటి నివాళులు -1

0 17

పాటల ఉద్యమాల చెలిమకు
కన్నీటి నివాళులు

గద్దర్ మరణ వార్త విని అతనిని అభిమానించే ఎందరో తన కన్నీటి నివాళులు అర్పించారు. విప్లవ అభిమాని సుభాష్ నివాళులు..

వరంగల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ సామ్రాట్ నివాళులు..

మీపాటనై వస్తానోయమ్మో మాయమ్మలారా
పొడుస్తున్న పొద్దులో నడుస్తున్న గానమైవ
వస్తానోయమ్మో మాయమ్మలారా
ఉద్యమాల పాటల గొంతునయ్యి
వస్తానోయమ్మో మాయమ్మలారా

అణచివేయబడ్డ ప్రజల గాయాల గుండెలశబ్దాన్ని పాటలుగా మలచి ప్రజాపోరాటాలకు ప్రాణం పోసిన
ఓ ప్రజల పాటల గొంతుక తెలంగాణ కలల సాకారమా పాటల జీవనది సామాజిక చైతన్య శీలి నీ పాటకు మాటకు త్యాగాల నీ జీవితానికి కన్నీటి నివాళులు.

. గద్దరన్న నువ్వు ప్రతిపాటల గొంతులో ఊటచెలిమై ఉద్బవిస్తావు అక్షరాల చైతన్యమై ఈ భూమీ మీద జరిగే ప్రతి ఉద్యమంలో జీవిస్తావు..

జోహార్ గద్దర్ అన్న
జోహార్ జోహార్ గద్దరన్న

– నాగబెల్లి జితేందర్ సామ్రాట్

పాటను ఊపీరిగా చేసుకుని తుది శ్వాష వరకు పోరాటం చేసిన గద్దర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తూ..

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking