Take a fresh look at your lifestyle.

పడకేసిన కాంగ్రెస్ ఐటీ సెల్

రాహుల్ గాంధీ కంట్లో పడి ఏదైనా పదవి తెచ్చుకుందామన్న ఆశతో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ చీఫ్ సామ రాంమోహన్ రెడ్డి ఉండొచ్చు.

0 58

– ఎన్నికల ముందు ఉన్న హడావిడి లేదు
– బీఆర్ఎస్ ఐటీ సెల్ ను ఎదుర్కోవడంలో విఫలం
– జాతీయ రాజకీయాలపై చర్చలో సామ రాంమోహన్

నిర్దేశం, హైదరాబాద్ః కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఐటీ చాలా కీలకంగా వ్యవహరించింది. కానీ, అధికారంలోకి వచ్చాక పాత ఊపు కనిపించడం లేదు. విపక్ష బీఆర్ఎస్ ఐటీ సెల్ ను ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇరుకున పెట్టిన దాఖలాలు కానీ, వారు చేసే దాడులకు కౌంటర్ ఇవ్వడం కానీ జరగడం లేదు. అధికారంలోకి వచ్చాం, ఇంకా ఐదేళ్లు మేమే ఉంటామని ధీమానో ఏమో కానీ, మచ్చుకైనా ఐటీ సెల్ ప్రభావం కనిపించడం లేదు.

టెండర్ నోటిఫికేన్లలో నో కౌంటర్
ఆర్టీసీ ఐటీ, సివిల్ సప్లైలోని వడ్ల టెండర్ నోటిఫికేషన్లలో లోపాలను బయటపెట్టిన బీఆర్ఎస్ ఐటీ సెల్.. ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడింది. వీటిపై కనీసమైన కౌంటర్ చేయలేకపోయింది కాంగ్రెస్ ఐటీ సెల్. ఆ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులను బీఆర్ఎస్ ఐటీ సెల్ టార్గెట్లు చేసింది. బీఆర్ఎస్ నేతలు వరుస ప్రెస్ మీట్లతో దూకుడుగా ఉన్నా, కాంగ్రెస్ ఐటీ సెల్ మాత్రం నిద్రావస్తలో ఉండిపోయింది.

జాతీయ రాజకీయంలో ఐటీ చీఫ్
తెలంగాణ కాంగ్రెస్ ఐటీ చీఫ్ సామ రాంమోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలను బొత్తిగా పట్టించుకోవడం లేదు. పూర్తిగా జాతీయ రాజకీయాల్లో గడుపుతున్నారు. బహుశా ఆయన రాహుల్ గాంధీ కంట్లో పడి ఏదైనా పదవి తెచ్చుకుందామన్న ఆశతో ఉండొచ్చు. అందుకేనేమో రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

గతంలోని ఊపేది?
2022 నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ఐటీ సెల్ దూకుడుగా పని చేసింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఐటీ సెల్ దూసుకుపోతుంటే, కాంగ్రెస్ ఐటీ సెల్ మాత్రం పడకేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking