Take a fresh look at your lifestyle.

పేద విద్యార్థులకు సహకారం-‘విద్యాధన్’ ఉపకారం!

0 15

పేద విద్యార్థులకు సహకారం – ‘విద్యాధన్’ ఉపకారం!

హైదరాబాద్, జూన్ 2 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్‌ 15, తెలంగాణ విద్యార్థులు జూన్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌‌లు అందచేస్తారు. మరిన్ని వివరాలకు 8367751309(ఏపీ), 6300391827(టీఎస్‌) అనే నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.
వివరాలు..
* విద్యాధన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్- 2023
అర్హత: 90 శాతం మార్కులతో పదోవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులకు పదోవ తరగతిలో కనీసం 75 శాతం ఉత్తీర్ణత ఉండాలి. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
స్కాలర్‌షిప్: ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌ అందుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ:
ఆంధ్రప్రదేశ్- 15.06.2023.
తెలంగాణ- 20.06.2023.
➥ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ:
ఆంధ్రప్రదేశ్- 02.07.2023.
తెలంగాణ- 09.07.2023.
➥ ఇంటర్వ్యూ/ పరీక్షల తేదీలు:
ఆంధ్రప్రదేశ్: 16 – 31.07.2023 వరకు.
తెలంగాణ: 26 – 31.07.2023 వరకు.

Leave A Reply

Your email address will not be published.

Breaking