Take a fresh look at your lifestyle.

కంప్యూటర్ యుగంలో మూఢనమ్మకాలు

0 543

ఔను.. మనం కంప్యూటర్ యుగంలో ప్రయాణిస్తున్నాం.. ఇంటర్ నెట్ తో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం.. అయినా.. తరతరాలుగా వస్తున్న మూఢ నమ్మకాలను ఇంకా పట్టుకుని వేలాడుతున్నాం.. ఈ కవిత రాసింది ఎవరో కానీ.. సోషట్ మీడియాలో వచ్చింది. కవిత్వంలో నిజం ఉంది. ఆలోచన ఉంది.

ఎలుక రాతిది అయితే
పూజిస్తాం…
ప్రాణాలతో
వుంటే తరిమేస్తాం.

పాము రాతిది అయితే
పాలు పోస్తాం…
ప్రాణాలతో వుంటే
కొట్టి చంపేస్తాం.

తల్లిదండ్రులు
ఫోటోలో ఉంటే
దండ వేసి
దండం పెడతాం…
ప్రాణాలతో వుంటే
వృద్ధాశ్రమంలో
వదిలేస్తాం.

చనిపోయిన వాడికి
భుజాన్ని అందిస్తాం…
బతికి ఉన్న వాడికి
చేయూతను ఇవ్వలేం.

రాయిలో దైవత్వం
వుందని తెలుసుకున్నాం…
మనిషిలో మానవత్వాన్ని
గుర్తించలేక పోతున్నాం.

జీవం లేని వాటిపై ఉన్న భక్తి, ప్రేమ…
ప్రాణంతో ఉన్నవాటిఫై ఎందుకు లేదో…
మనిషిగా ఆలోచిద్దాం కొద్దిగా..!
🪷🙌🪷🙏🙇🏻‍♂️🙏🪷🙌🪷

– సోషల్ మీడియా పోస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking