Take a fresh look at your lifestyle.

విశాఖలో వారసుడు సినీ యూనిట్ సందడి

0 185

‘‘వారసుడు’’ బ్లాక్ బస్టర్ హిట్ కావడం గర్వంగా ఉంది

: నిర్మాత దిల్ రాజు

వారసుడు సినిమా ఇటు తెలుగు అటు తమిళం లో కూడా బ్లాక్ బస్టర్ హి ట్ అవ్వడం ఎంతో గర్వంగా ఉందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు.శుక్రవారం విశాఖ పట్టణంలోని సూర్యా బాగ్ లో గల మెలోడీ థియేటర్ లో వారసుడు సినీ యూనిట్ శుక్రవారం సందడి చేసింది.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రజల అభినందనల వెల్లువ వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. పది రోజులు తరువాత కుడా సినిమా కి అదే ఆదరణ కొనసాగుతుంది అన్నారు.

తమన్ సంగీతం సినిమాకు వెన్నెముక గా నిలిచిందన్నారు. చిత్ర సంగీత దర్శకుడు *తమన్ మాట్లాడుతూ , బృందావన్ తరువాత దర్శకుడు వంశీ తో మళ్ళీ పని చేశా అన్నారు. నిర్మాత దర్శకులు ప్రోత్సాహం తోనే మంచి సంగీతం కుదిరింది అన్నారు. నటుడు శ్యామ్ మాట్లాడుతూ, తనకు తెలుగు అంటే ఎంతో అభిమానం అన్నారు. దిల్ రాజు ఉత్తమ నిర్మాత అని కొనియాడారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, వైజాగ్ అంటే తనకు సెంటిమెంట్ అన్నారు. విశాఖ వచ్చినప్పుడల్లా సంపత్ వినాయక గుడి, సింహాద్రి అప్పన్న గుడి కి వెళతా అన్నారు. తన సినిమాలు విశాఖలో షూటింగ్ జరిగాయి అని గుర్తు చేశారు. ఇది అందరూ కష్టపడి చేసిన సినిమా అన్నారు. భారత్ సూపర్ స్టార్ విజయ్ ఇటువంటి కథ ఒప్పు కాగానే భయం వేసిందన్నారు. ఇందులో నటులంతా బాగా చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో నటి సంగీత , డిస్ట్రిబ్యూటర్ ప్రతినిధులు దిల్ శ్రీనివాస్, థియేటర్ మేనేజర్ లు గౌరి శంకర్, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking