Take a fresh look at your lifestyle.

టీమ్ వర్క్ తో సక్సెస్ వస్తుంది – డీజీపీ

0 73

ఆధునిక పోలీసింగ్ నిర్వహణలో జిల్లాలో రెండు పోలీస్ స్టేషన్లు ప్రతిభ.

30 పోలీస్ స్టేషన్ల ర్యాంకింగ్ ను వెల్లడించిన రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్

తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు 7 వ స్థానం,

నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు 15 స్థానం

హైదరాబాద్, ఏప్రిల్ 11 (వైడ్ న్యూస్) రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో DGP అంజనీ కుమార్ పోలీస్ స్టేషన్ ల ర్యాంకింగ్ లను ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి సూర్యపేట జిల్లా  ఎస్పీ రాజేంద్ర ప్రసాద్  జిల్లా పోలీసు కార్యాలయం నుండి హాజరై మాట్లాడారు.

CCTNS నిర్వహణ, పోలీస్ ఫంక్షనల్ వర్టికల్, పోలీస్ స్టేషన్ల 5S నిర్వహణ, 60 రోజుల్లో నేర అభియోగం పత్రాల దాఖలు, కేసుల్లో శిక్షల అమలు, కేసుల స్థితిగతుల అంతర్జాల నమోదు, కోర్టు కేసుల నిర్వహణ, కమ్యూనిటీ కార్యక్రమాలు, సంఘటనలపై రియల్ టైమ్ స్పందన, సాంకేతికత వినియోగం, కేసుల పరిష్కారం, కేసుల చేదన, క్రైమ్ తగ్గించడం, డయల్ 100 పిర్యాదులపై స్పందన, రోడ్డు భద్రత  మొదలగు అంశాలను కొలమానంగా తీసుకుని ఈ ర్యాంకింగ్ లను ప్రకటించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర పోలీసు పారదర్శకంగా సామర్థ్యంతో పని చేస్తుంది.  ప్రతి పోలీసు స్టేషన్ మొదటి ర్యాంక్ లో ఉండాలన్నారు డీజీపీ అంజనీ కుమార్.. ఈ సందర్భంగా DGP జిల్లా పోలీసు సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లాలో పోలీసులు ప్రజలతో భాగస్వామ్యమై పని చేస్తున్నరన్నారు. పోలీసు పనులను అత్యంత సామర్ధ్యంగా నిర్వర్తిస్తూ వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు ఆయన. క్రింది స్థాయిలో టీమ్ వర్క్ చేస్తూ అధికారులు నిత్యం కృషి చేస్తున్నారని డీజీపీకి వివరించారు. ప్రజల సహకారం తో ముందుకు వెళతాం అని అత్యుత్తమైన పోలీసు సేవలను అందజేస్తామని ఎస్పీ అన్నారు.

ఈ కార్యక్రమం నందు DSP లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, DCRB DSP రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ నర్సింహ, నాగారం సర్కిల్ CI రాజేష్, హుజూర్నగర్ CI రామలింగరెడ్డి, RI శ్రీనివాస్, తిరుమలగిరి SI  శివ కుమార్, నేరేడుచర్ల SI నవీన్, DCRB, IT కోర్ SI లు రవీందర్, సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking