Take a fresh look at your lifestyle.

ఆబద్దపు వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు : పోలీసులు

0 130

అనంతపురం: జిల్లాలో ఈ ఏడాది ” 14 రోజుల్లో 16 మంది అమ్మాయిల అదృశ్యం”… ” 14 రోజుల్లో 16 మంది అమ్మాయిలు మిస్సింగ్ … ఎక్కడ ఉన్నారు.

యాడ పడుకున్నారు” అంటూ అసత్య ప్రచారం చేసిన Way2news మరియు @RamsRedchilli16 వారిపై చర్యలు తీసుకున్న అనంతపురం పోలీసులు

అనంతపురం ఒన్ టౌన్ పోలీసు స్టేషన్లో Way2news మరియు @RamsRedchilli16 వారిపై క్రైం నంబర్ 25/2023 505(2) IPC and sec 74 of it act కేసు నమోదు చేశారు. నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైన పోలీసులు

ఈ కేసు దర్యాప్తులో భాగంగా Way2news మరియు @RamsRedchilli16 వారు చేసిన పోస్టులను నిర్ధారించుకోకుండా తిరిగి సోషల్ మీడియాలో వాటినే పోస్ట్ చేసిన వారికి సైతం నోటీసులు అందజేయనున్న పోలీసులు

ప్రజల్లో అలజడులు, ఆందోళనలు రేకెత్తేలా తప్పుడు సమాచారాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

– అనంతపూర్ జిల్లా పోలీసులు

Leave A Reply

Your email address will not be published.

Breaking