Take a fresh look at your lifestyle.

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

0 368

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన సోమవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై అభ‌య‌మిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.

మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు.  మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.

ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు

ఆలయం వద్ద గల వేదికపై ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

సాయంత్రం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి రవిప్రభ నాదస్వరం, శ్రీ చంద్రశేఖర్ డోలు బృందం మంగళధ్వని వినిపించారు. ఆ తర్వాత శ్రీ కె.సుధాకర్ బృందం గాత్ర సంగీతం, శ్రీమతి బి.చిన్నమదేవి బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థ సారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking