Take a fresh look at your lifestyle.

పేపర్ లీకేజ్ లో సిట్ అధికారుల స్పీడ్..

0 434

పేపర్ లీకేజ్ రాజకీయం

సిట్ అధికారుల స్పీడ్.. పెన్ డ్రైవ్ లో మూడు పేపరులు గుర్తింపు

పేపర్ లీకేజ్ రాజకీయం.. ఔను.. అన్యాయం జరిగిందంటే అందరూ స్పందించాల్సిందే. మరి.. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ముడి పడి ఉన్న ఈ పేపర్ లీకేజ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల చుట్టు తిరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, విద్యార్థి సంఘాలు అన్ని ఉద్యమం వైపు పరుగులు పెడుతున్నారు.

హైదరాబాద్, మార్చి 17, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకటైన ప్రవీణ్ కు చెందిన పెన్ డ్రైవ్ లో మూడు పేపర్లను పోలీసులు గుర్తించారు. ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులను ప్రవీణ్ ను విచారించారు. ప్రవీణ్ పెన్ డ్రైవ్ ఎఫ్ఎన్సీ విభాగానికి పంపించారు పోలీసులు. ఈ పెన్ డ్రైవ్ లో మూడు పేపర్లు కాపీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సహా మరో పేపర్ కాపీ చేసినట్లు తెలుస్తోంది.  పేపర్ల లీకేజీ కేసును ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే ఏఈ ప్రశ్నాపత్రం లీక్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో అధికారులు మరో మూడు పేపర్లు గుర్తించారు. ఏఈ పేపర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లు, టెక్నికల్ ఆఫీసర్ పరీక్షల పేపర్లు లీక్ ఆరోపణలు వచ్చాయి.

విచారణలో భాగంగా ఏఈ పేపర్ నకళ్లు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద ఏఈ, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్లను ఉంచుకున్నాడు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేపర్ నకళ్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక అడిగినందువల్లే టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్, , పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌ రెడ్డి పేపర్లు లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

234

837 అసిస్టెంట్ ఇంజినీరు పోస్టులకు  మార్చి 5న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీకైందన్న సమాచారంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తొలుత మార్చి 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు లీకయ్యాయని భావించారు. కానీ, ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు కంప్యూటర్ నుంచి కాపీ చేసిన ఫోల్డర్‌లో ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలతో పాటు భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు తెలిసింది.

ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా అసిస్టెంట్ ఇంజినీర్ రాత పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు మార్చి 5న నిర్వహించిన రాతపరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో ఈ పరీక్ష కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అని అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమైంది.

దీంతో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)  పరీక్షపై బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి మార్చి 14న మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ కమిషన్. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు ఇటీవల నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీకరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking