Take a fresh look at your lifestyle.

కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

0 15

కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు..

తెలంగాణలో రాగల 3 రోజుల పాటు

తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

.హైదరాబాద్ జూన్ 8 :  వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. నిన్న ఉత్తర చత్తీస్‌ఘడ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీన పడింది. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలో ప్రవేశించాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా.. తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అక్కడక్కడ.. ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు , మెరుపులు, ఈదురు గాలులుతో (గాలి గంటకు 30 నుంచి 40 కి మీ వేగం) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులుతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో వడగాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట , కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం , మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking