Take a fresh look at your lifestyle.

ఫామ్ హౌస్ లపై ఎస్ ఓ టీ పోలీసుల దాడులు

0 365

హైదారబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని  ఫామ్ హౌస్ లలో ఎస్ ఓ టీ పోలీసులు దాడులు చేశారు. మోయినాబాద్‌ లోని బిగ్‌ బాస్‌ ఫామ్‌హౌస్‌, జహంగీర్ డ్రీమ్‌ వ్యాలి , శంషాబాద్ పరిలోని రిప్లెజ్‌ ఫామ్ హౌస్‌, మేడ్చల్‌ లోని గోవర్ధన్‌ రెడ్డి ఫామ్ హౌస్ లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు.

పోలీసుల దాడులలో మద్యం సీసాలు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 32 ఫామౌస్ లలో తనిఖీ లు చేపట్టిన పోలీసులు. 4 ఫామ్ హౌస్ లలో పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ అసాంఘీక కార్యకలపాలకు పాల్పడుతున్న 22 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking