Take a fresh look at your lifestyle.

రాజకీయాల్లోకి స్మితా సబర్వాల్‌ ?

0 22

రాజకీయాల్లోకి స్మితా సబర్వాల్‌ ?
త్వరలో నిర్ణయం దిశగా అడుగులు
సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ

(ఈదుల్ల మల్లయ్య)

స్మితా సబర్వాల్‌ రాజకీయాల్లోకి వస్తున్నారన్న చర్చ బలంగా వినిపిస్తోంది. త్వరలో నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారన్న టాక్‌ వినిపిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఓ యూ ట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మీరు రాజకీయాల్లో వస్తున్నారా అని ప్రశ్నించగా.. ఫ్యూచర్‌ లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం.. చూడాల్సిందే.. నంటూ వ్యాఖ్యనించారు.

స్మితా సబర్వాల్‌.. తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా కొనసాగుతున్నారు. డైనమిక్‌ ఐఏఎస్‌ అధికారిగా పేరు గాంచిన ఆమె సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ట్విటర్‌ ద్వారా ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. ట్విటర్‌లో ఆమెకు 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె క్రేజ్‌. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె ప్రముఖంగా వార్తల్లో నిలిచారు.

కాంగ్రెస్‌ సర్కారు ప్రాధాన్యత తగ్గించడంతో సెంట్రల్‌ సర్వీసులకు వెళతారన్న వార్తలు కూడా వచ్చాయి. నిజంగానే ఆమె సెంట్రల్‌ సర్వీసులకు వెళతారా? భవిష్యత్ రాజకీయాల్లోకి వస్తారా, తనపై విమర్శలకు ఎలా స్పందిస్తారు, ఉద్యోగ నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటారు లాంటి ప్రశ్నలకు స్మితా సబర్వాల్‌ ఇంటర్వ్యూలో స్వయంగా సమాధానాలిచ్చారు.

సెంట్రల్‌ సర్వీసులకు వెళుతున్నారని వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. నేను అప్లయ్‌ చేసినట్టు నాకే తెలియదు. కొన్ని విషయాలు యూట్యూబ్‌ లో చూసి తెలుసుకుంటాను. నా లైఫ్‌ గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు అంటూ సెటైర్లు వేశారు. సెంట్రల్‌ సర్వీసులకు వెళ్లడం లేదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లో వస్తారా అని ప్రశ్నించగా.. ఫ్యూచర్‌ లో ఏం జరుగుతుందో చూడాలంటూ సమాధానమిచ్చారు. తనపై వచ్చే విమర్శల గురించి పెద్దగా పట్టించుకోనని, తన పని తాను సిన్సియర్‌గా చేసుకుపోతానని చెప్పారు. మెదక్‌ ప్రాంతంతో చాలా బ్యూటిఫుల్‌ మెమరీస్‌ ఉన్నాయని.. వర్కింగ్‌ విమెన్‌ తనకు స్ఫూర్తి అని తెలిపారు. సోషల్‌ మీడియాలో తనకున్న క్రేజ్‌ గురించి మాట్లాడుతూ.. మంచి పనులు చేస్తే జనం అభిమానిస్తారని స్మితా సబర్వాల్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking