Take a fresh look at your lifestyle.

17న సీతారాముల కళ్యాణం- కేసీఆర్ జన్మదిన వేడుకలు

0 169

17న సీతారాముల కళ్యాణం

హైదరాబాద్, ఫిబ్రవరి 15, ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69వ పుట్టిన రోజు. అయితే సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నల్లకుంట కోరంటి ఆస్పత్రి పక్కునున్న పురాతన రామాలయంలో ఘనంగా సీతారాముల కల్యాణం నిర్వహించబోతున్నట్లు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.

సీఎం కేసీఆర్ చిన్ననాటి గురువైన తెలుగు పండిట్ శ్రీ వేలేటి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కన్నులపండువగా సీతారాముల కల్యాణం జరిపిస్తామని వివరించారు. ఈ కల్యాణ మహోత్సవంలో మొత్తం 11 జంటలు పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ దేశం మొత్తం విస్తరించి, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించాలని ఈ కార్యం తలపెట్టినట్లు వివరించారు. అలాగే ఆయురారోగ్యాలతో నూరేళ్ల సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని, ఆయన అనుకున్న లక్ష్యాలు అన్నీ నెరవేరేలా, భవిష్యత్తులో ఆయన భారత ప్రధాని కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ కల్యాణోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొనాలని కోరారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాదంతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడే తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుడగానే సచివాలయ కొత్త భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సచివాలయం వాయిదా వేసారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking