Take a fresh look at your lifestyle.

భద్రాద్రి రాముడికి సిరిసిల్ల చీరలు

0 15

భద్రాద్రి రాముడికి సిరిసిల్ల చీరలు
నిర్దేశం, కరీంనగర్ :
సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు సీతారాముల కల్యాణానికి చీరను ప్రతి సంవత్సరం అనవాయితీగా అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను తన చేనేత మగ్గంపై నేసి అబ్బుర పరిచాడు. చీరపై సీతారాముల కళ్యాణ చిత్రం కనిపించే విధంగా.. అలాగే చీర అంచులో భద్రాద్రి దేవాలయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు, శంకు, చక్ర, నామాలు వచ్చేలా రూపుదిద్దాడు. చీర బార్డర్ లో జైశ్రీరామ్ పేరు వచ్చే విధంగా నేశారు. ఆరు రోజుల పాటు చేనేత మగ్గంపై శ్రమించి ఈ బంగారు, వెండి, జరి పోగు దారాలతో పట్టు చీరను రూపుదిద్దాడు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది. ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలు ఉన్నాయి. చీర కొంగులో సీతారాముల కళ్యాణం బొమ్మని నేయడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.

Breaking