Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట టూ షోలాపూర్‌కు డీలక్స్ బస్సు

0 16

సిద్ధిపేట టూ షోలాపూర్‌కు

డీలక్స్ బస్సు సర్వీస్ ప్రారంభం

సిద్ధిపేట, మే 3 : పెరుగుతున్న అవసరాలు, ప్రజా సౌకర్యార్థం ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేర వేయడంతో పాటు రద్దీకి అణుగుణంగా నూతన డీలక్స్ సర్వీస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.

షోలాపూర్‌కు వెళ్లే ప్రయాణీకులు అందరూ అధునాతన బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుని, మీరు మరింత సౌకర్యవంతమైన, తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకునే బస్సులో ప్రయాణించి ప్రయాణ అనుభూతిని పొందాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సిద్ధిపేట నుంచి షోలాపూర్‌ వరకు మూడు నూతన డీలక్స్ సర్వీసు బస్సులను బుధవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా సిద్ధిపేట డిపో ఆర్టీసీ బస్సులను ఆదరిస్తూ డిపో ఆదాయాన్ని, దాని ద్వారా ఆర్టీసీ సంస్థ ఆదాయం పెరగడానికి సహకరిస్తున్న ప్రయాణీకులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking