Take a fresh look at your lifestyle.

రైతుల ధీన స్థితి చూసి సిగ్గు పడు కేసీఆర్ : వైఎస్ షర్మిల

0 12

రైతుల ధీన స్థితి చూసి సిగ్గు పడు కేసీఆర్ సిగ్గు పడు..
 : వైఎస్ షర్మిల

హైదరాబాద్, మే 11 : వడ్లు మొలకెత్తి.. గుండె భారమై ఓ కౌలు రైతన్న ప్రాణం పోయింది. చనిపోతానని ముందే చెప్పినా.. ఆదుకోని అసమర్థ ప్రభుత్వమిది. కండ్లు ఉన్నా చూడలేని సర్కారు ఇది. చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమిదని వైఎస్సార్ టీపీ పార్టీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. కేసీఆర్ దొరకు..రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దు. ఓట్ల కోసం.. రైతు నినాదం కావాలి.కానీ ఆదుకునే విధానం వద్దు. సిగ్గుపడు కేసీఆర్ . సిగ్గుపడు. తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల మంది రైతులను బలి తీసుకున్న కేసీఆర్. మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకూ కొను అని అన్నారు. ఐకేపీ సెంటర్లు అన్ని తెరువు.క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపు. తడిసిన వడ్లు సైతం కొను. ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.10 వేలు నష్ట పరిహారం ఇవ్వు. ఇప్పటికే 2023లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా. పంట బీమా కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ దని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking