Take a fresh look at your lifestyle.

ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు

0 411

ఇద్దరు అమ్మాయిలతో సతీష్ పెళ్లి

ఖమ్మం, మార్చి 9, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు.. ఔను మీరు చదివింది నిజమే.. ఓ యువకుడు ఒకే ముహుర్తంలో ఇద్దరు అమ్మాయిల్ని మనువాడబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి పిల్ల దొరకట్లేదని కొంతమంది బాధపడుతుంటే, ఒక్కడికి ఒకేసారి రెండు పెళ్లిళ్లా అంటూ ట్రోల్ చేస్తున్నారు. “లడ్డూ కావాలా” నాయనా అంటూ మీమ్స్ చేస్తున్నారు.ఖమ్మం జిల్లా చర్ల మండలం ఎర్రబోడుకు చెందిన మడివి సత్తిబాబు ఇదే మండలంలోని దోసిల్లపల్లికి చెందిన స్వప్న కుమారి, కున్నాపల్లికి చెందిన సునీతలను ఒకే ముహుర్తంలో పెళ్లి చేసుకున్నాడు.

మరో విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరితో సత్తిబాబు ఇప్పటికే సహజీవనం చేస్తున్నాడు. యువతుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిపై గొడవలు కూడా జరిగాయి. ఇద్దరితో కలిసి ఉండాలని నిర్ణయించుకోవడంతో మూడు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి చేయాలని నిర్ణయించారు.

కుటుంబ సభ్యుల అంగీకారంతో కొంతకాలంగా స్వప్న, సునీతతో సత్తిబాబు సహ జీవనం చేస్తున్నాడు. యువతులకు చెరో సంతానం కలిగినట్లు సమాచారం. గురువారం గిరిజన సంప్రదాయ పద్ధతిలో యువతులతో సత్తిబాబు పెళ్లి ప్రమాణాలు చేశాడు.ఈ తరహా ఘటనలు ఏదో బయటకు తెలియకుండా గుట్టుకు సాగిపోవడం కామన్‌ అయినా సత్తిబాబు మాత్రం గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కొడుకు ఒకరే.. వధువులు ఇద్దరి పేర్లతో పెళ్లి కార్డులు కూడా ముద్రించారు. ఓకే ముహూర్తాన ముగ్గురూ ఒక్కటి అయ్యారు.

ఒకే పెళ్లి మండపంపై ఇద్దరు వధువులను వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే పెళ్లి పత్రికలను బంధువులకు పంచేశారు. సత్తిబాబు పెళ్లి శుభలేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడేళ్ల క్రితమే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి ఇంటికి తెచ్చుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇరుపక్షాల పెద్దల అంగీకారంతో తాజాగా వారిని గిరిజన సంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు.చర్ల మండలం మారుమూల ఎర్రబోరుకు చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదివుకున్నాడు. ఇదే మండలం దోశిల్లపల్లికి చెందిన స్వప్న కుమారిని ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో ప్రేమించాడు.

అదే క్రమంలో వరుసకు మరదలైన కుర్నపల్లికి చెందిన సునీతను సైతం ఇష్టపడ్డాడు. చాలా కాలం ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిచినా ఆ తర్వాత విషయం అమ్మాయిలకు తెలిసిపోయింది.పెళ్లి విషయం తేలకముందే మూడేళ్లుగా ఇద్దరితో కలిసి జీవిస్తున్నాడు.

ఈ క్రమంలో స్వప్నకు ఓ పాప, సునీతకు బాబు పుట్టారు. అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని కోరడంతో .. ఇద్దరినీ అమితంగా ప్రేమించానని.. ఇద్దరినీ పెళ్లాడతానని ఇరు పక్షాల దగ్గర ఒప్పించుకున్నాడు. మూడు గ్రామాల పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో ముగ్గురి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ముగ్గురు ఈ పెళ్లిళ్లకు అంగీకారం చెప్పడంతో వారి పెళ్లికి నిశ్చయించారు..గిరిజన సంప్రదాయాల్లో పెళ్లిక ముందు కలిసి జీవించడం తప్పేమి కాదు. యువతీ యువకులు ఇష్టపడితే ముందుగానే కలిసి జీవించొచ్చు. సహ జీవనం గిరిజన సాంప్రదాయాల్లో తప్పుగా పరిగణించరు.

సత్తిబాబు ఇంట్లో ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించారు. గ్రామ పెద్దల సాక్షిగా ఇద్దరు వధువులను సత్తిబాబు పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురికి ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతోందని గ్రామస్థులు తెలిపారు.మరోవైపు ఈ అంశంపై స్థానిక సీఐ అశోక్‌ అంశంపై తమకు సమాచారం అందలేదని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking