Take a fresh look at your lifestyle.

గద్దర్ కు సెల్యూట్ కొట్టిన పోలీస్ బాస్ వీసీ సజ్జనర్‌

0 20

గద్దర్ కు సెల్యూట్ కొట్టిన

పోలీస్ బాస్ వీసీ సజ్జనర్‌

ప్రజా గాయకుడు గద్దర్‌ పార్థివ దేహానికి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ నివాళి

హైదరాబాద్‌, ఆగస్టు 07 : హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్‌ గారి పార్థివ దేహానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(సంస్థ) ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు నివాళులు అర్పించారు. గద్దర్‌ గారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి.. ఓదార్చారు.

ఈ సందర్భంగా గద్దర్‌ గారితో తనకున్న అనుబంధాన్ని సజ్జనర్‌ గారు గుర్తు చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారు. అంతలోనే గద్దర్‌ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్‌ గారు నిలిచిపోయారని కొనియాడారు.

”గద్దర్ గారితో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్‌ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారు.” అని సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు గుర్తుచేసుకున్నారు.

ప్రజాస్వామ్యం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యమని గద్దర్‌ భావించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తను మొదటి సారిగా ఓటు హక్కును వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారని అన్నారు.

గద్దర్ గారి పార్ధివ దేహానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున నివాళులు అర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు ప్రకటించారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking