Take a fresh look at your lifestyle.

గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్ అరెస్ట్

0 40

గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్ అరెస్ట్

హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్ మంగళహట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళహట్ కు చెందిన మన్మోహన్ సింగ్ స్థానికంగా పలు కేసులు ఉండడంతో పోలీసులు రౌడీషీట్ పెట్టారు.

నిందితుడు సులభంగా డబ్బులు సంపాదించేందుకు గంజాయిని విక్రయిస్తున్నాడు. గతంలో పలుమార్లు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయించేందుకు వేచి చూస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మంగళహట్ సీఐ రవి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking