Take a fresh look at your lifestyle.

జీ 20 శిఖరాగ్ర సదస్సుపై సమీక్ష

0 12

భారత విశిష్టతను చాటి చెప్పేందుకు..

జీ 20 శిఖరాగ్ర సదస్సుపై సమీక్ష

హైదరాబాద్, మే 16 : జూన్ 15-17 మధ్య హైదరాబాద్ లో జరగనున్న జీ 20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన సమీక్షకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గోన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయరంగంలో ముందుకుపోతున్నది. ఉత్పత్తి, ఉత్పాదకతలో తెలంగాణ ముందున్నది. జీ20 సదస్సు ద్వారా తెలంగాణతో పాటు, భారత విశిష్టతను చాటి చెప్పేందుకు కలిసి పనిచేద్దామని అన్నారు.

హైదరాబాద్ చారిత్రక నగరం. తెలంగాణ వ్యవసాయరంగంలో ముందున్న నేపథ్యంలో ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. వసతులు, విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలకడం, వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, కళలను పరిచయం చేస్తాం… చారిత్రక విశిష్టతను చాటిచెబుతాం. హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించడం గర్వకారణం. దేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుంది. పంటల మార్పిడిలో, వ్యవసాయంలో సాంకేతిక వినియోగంలో దేశంలో రాష్ట్రం ముందున్నది. ఈ సదస్సు లోతైన చర్చలతో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking