Take a fresh look at your lifestyle.

పోలీసు శాఖలో ఉన్నతాధికారులపై రేవంత్ రెడ్డి మార్క్..

0 20

సీఎం రేవంత్ రెడ్డి రూటే సపరేట్
– బీఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యవహరించిన వారే టార్గెట్
– రేవంత్ రెడ్డి టార్గెట్ గా పని చేసిన వారికి లూప్ లైన్
– ప్రభుత్వం మారగానే రిజైన్ చేసిన బీఆర్ఎస్ కొటారి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. ఆరు రోజుల వ్యవధిలోనే తనదైన శైలిలో పాలన కొనసాగించడంతో అందరి దృష్టిలో పడ్డారు. బీఆర్ ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన కొందరు ఉన్నత అధికారులు ఇప్పటికే ఇంటి దారి పట్టారు. రిటైర్ మెంట్ తరువాత కేసీఆర్ వారికి స్పెషల్ ఆన్ డ్యూటీ కిందనో.. ప్రభుత్వ సలహాదారులుగానో పోస్టింగ్ లు ఇచ్చారు. అలాంటి పెద్దలు కేసీఆర్ లాభం చేయడమే ధ్యేయంగా పని చేసారు. పొలిటికల్ వ్యవస్థలో ఇంటిలిజెన్స్ వింగ్ చాలా ముఖ్యమైనది. కేసీఆర్ తన కొటారిని ఏర్పాటు చేసుకుని దొరలా గడిలో ఉండి పాలన కొనసాగించారు.
నిర్దేశం, హైదరాబాద్ :

ఐపీఎస్ ఆఫీసర్ లు ప్రభాకర్ రావు.. రాధక్రిష్ణ వీళ్లిద్దరూ కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనేది నిజం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదవులకు రాజీనామాలు చేసి ఇంటికి వెళ్లినా మిమ్మల్ని జైలుకు పంపిస్తానని ఎన్నికల ప్రచారంలో టీఎస్ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అప్పట్లో హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమకు వ్యతిరేకంగా పని చేసిన పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసారు రేవంత్ రెడ్డి. ఐపీఎస్ ఆఫీసర్ లు ప్రభాకర్ రావు.. రాధక్రిష్ణ లతో పాటు సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంధ్ర లు బీఆర్ ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీపై కత్తి పట్టిన వారిని..

మంగళవారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ మూడు కమీషనరేట్ ల సీపీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ముఖ్యంగా బీఆర్ ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసు, ఇతర ఉన్నతాధికారులను గుర్తించడంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యవహరించడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేసిన వారిని లూప్ లైన్ కు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో తమ సామాజిక వర్గానికి కీలకమై పదవులు అప్పగించినందున అలాంటి వారిని గుర్తించి లూప్ లైన్ లో పంపడానికి రంగం సిద్దమైతున్నట్లు తెలుస్తోంది.

ఈ అధికారుల అరెస్టులు తప్పవా..?

గులాబి బాస్ కేసీఆర్ మెప్పు కోసం పని చేసిన అధికారులలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు మొదటి వరుసలో ఉంటారు. ఇంటిలిజెన్స్ వింగ్ లో పని చేసిన అతను కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ప్రతిపక్షాల ఫోన్ లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత రెండో వరుసలో ఐపీఎస్ ఆఫీసర్ రాధ క్రిష్ణ ఉంటారు. అతను టాస్క్ ఫోర్స్ డీసీపీ గా పని చేస్తూ తమ కాంగ్రెస్ కర్యకర్తలను వేదిస్తున్నారని రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. ఎప్పుడో రిటైర్డ్ అయినా ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేట్ సైన్యంను పెంచి పోషిస్తున్నారన్నారు ఆయన. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను, అనుకూలంగా ఉన్నవారిని, సహాయం చేస్తున్నవారిని రాధ క్రిష్ణ బెదిరిస్తున్నారన్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. అలాగే టీఎస్ పీఎస్ సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తమ పదవీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసిన గంటలోనే గవర్నర్ కు రాజీనామా లేఖ పంపడం వెనుక సీఎం ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి అవమానం..

నిజాయితీగా విధులు నిర్వహించే పోలీసు అధికారులకు ఎప్పుడు మంచే జరుగుతుంది. ఇగో.. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా రేవంత్ రెడ్డి పట్ల నిర్ధాక్షణంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారా అనేది చర్చానీయంషంగా మారింది. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. పోలీసులు అతి ఉత్సహంతో అతనిని ఇంట్లో నుంచి బనీన్ పైననే బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విషయమై ఎన్నికల కమీషన్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయగా అప్పటి వికరాబాద్ ఎస్ పీ అపూర్వరావు, కలెక్టర్ లను బదిలీ చేసింది ఎన్నికల కమీషన్.

కేసీఆర్ కు భజన చేసినోళ్లకే…

సమర్థులైన పోలీసు ఉన్నత అధికారులను లూప్ లైన్ లో పెట్టి తమ సామాజిక వర్గీయులైన అధికారులకు మంచి పోస్టింగ్ లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నీతిగా, న్యాయంగా, నిక్కచ్చిగా వ్యవహరించే పోలీసు ఉన్నత అధికారులను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ముఖ్యమైన పోస్టింగ్ లు ఇస్తున్నారు.

ముగ్గురు పోలీసు ఆఫీసర్ లు..

నిజాయితీకి గుర్తింపు..

. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసు కమీషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించింది. అయితే.. ఫైరావీలకు తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారులను గుర్తించి పోస్టింగ్ లు ఇవ్వడం పట్ల మేధావి వర్గం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. డీసీపీ, ఎస్ పీ, డిప్యూటీ డీసీపీ, అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు, డీఎస్పీ, ఏసీపీ, ఇన్ స్పెక్టర్ ల పోస్టింగ్ ల కోసం పలువురు పొలిటికల్ లీడరుల చుట్టూ తిరుగుతున్నారు. పొలిటికల్ కు తలోంచి పోస్టింగ్ లు ఇస్తారా లేక పనితనం చూసి పోస్టింగ్ లు ఇస్తారో నిరీక్షించాల్సిందే.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking