Take a fresh look at your lifestyle.

బియ్యపు గింజలపై రామానామం

0 143

బియ్యపు గింజలపై రామానామం

పదేళ్లుగా రాస్తున్న భక్తుడు

గద్వాల, మార్చి 29 (వైడ్ న్యూస్)జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఐజ పట్టణంలోని తుపత్రాల ఆచార్య చక్రవర్తి స్వామి శ్రీరామనవమి సందర్భంగా బియ్యపు గింజ పై శ్రీరామ నామాన్ని గత పది సంవత్సరాలుగా నిరంతరంగా అత్యంత భక్తిశ్రద్ధలతో రాస్తున్నారు. ప్రతిరోజు శ్రీరామ నామాన్ని 41 రోజులుగా రాస్తూ 35వేల బియ్యపు గింజల పై వ్రాసి తన భక్తిని చాటుకున్నారు.

శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అన్నట్లు, నిరంతరం ధర్మసేవ కార్యక్రమంలో ధర్మమంటే శ్రీ రాముడే అందరికీ ఆదర్శం. భగవన్నామ స్మరణలో ప్రతి ఒక్కరూ దైనందిన కార్యక్రమంలో భగవంతుని పట్ల ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో శ్రీ రామ నామాన్ని ఉచ్చరిస్తూ, తమ జీవితాన్ని గడపాలని శ్రీ ఆచార్య చక్రవర్తి తెలిపారు.
రామా అనే అక్షరం లోనే అగ్నితత్వము, సూర్య తత్వము ,చంద్ర తత్వము ఉంటాయి. కాబట్టి శ్రీరామ నామము చాలా అద్భుతమైనది. రామా అంటే మోక్షం కలుగుతుంది . రామ అంటే ధైర్యం వస్తుంది. శ్రీరామ్ అంటే సర్వపాపాలు నశిస్తాయి. మోక్షం మార్గానికి భగవన్నామ స్మరణ ని మించినది లేదు. కాబట్టి శ్రీరామ నామాన్ని మనం జపిస్తుంటే అంతా మంచిదే జరుగుతుందని, అలాగే సకుటుంబ సపరివారంగా అందరు కూడా ఈ శ్రీరామ నామాన్ని జపించాలని సందర్భంగా అయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking