Take a fresh look at your lifestyle.

ఆత్మబలిదానాలు వృధా కావద్దు : ప్రియాంక గాంధీ

0 14

తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు

ఆత్మబలిదానాలు వృధా కావద్దు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి

ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు

జైబోలో తెలంగాణ అని  ప్రసంగాన్ని ప్రార్రంబించిన ప్రియాంక గాంధీ

హైదరాబాద్ మే 8 : తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. జైబోలో తెలంగాణ అని ఆమె ప్రసంగం ప్రారంభించారు. ‘తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది’ అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ‘ జైబోలో తెలంగాణ’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

‘‘తెలంగాణ మీకు తల్లి వంటిది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు.

ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు. ఆత్మబలిదానాలు వృధా కావద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలవారు పోరాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ తమ జాగీరులా భావిస్తున్నారు’’ అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.

నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి

తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంక అన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని, పేపర్‌ లీక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు తగ్గించారని ధ్వజమెత్తారు. ప్రతి వ్యక్తిపై రూ.వేల అప్పులు మోపారని, కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలు చేయను.. ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని ప్రియాంకగాంధీ ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking