తీహార్ జైలుకు కవిత
14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్
నిర్దేశం, ఢిల్లీ :
కల్వకుంట్ల కవిత… మాజీ సీఎం కేసీఆర్ ముద్దుల కూతురు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధికంగా లాభ పడ్డాది కూడా కేసీఆర్ ఫ్యామిలీయే. అగో.. అక్రమంగా ఆస్తులు సంపాదించడంలో అడ్డంగా దొరికింది కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాంలో వంద కోట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇచ్చారనే ఆరోపణలపై జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
మరో 14 రోజులు కస్టడీకి కవిత..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన మాజీ సీంఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో మంగళవారం కవితను కోర్టులో హాజరు పరిచారు. అయితే.. వాదోపవాదాలు విన్న కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విదించింది కోర్టు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కొడుకు ఎగ్జామ్స్ పేరుతో..
కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్యా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ పేరుతో తాత్కలిక బెయిల్ కోసం కోర్టులో ఫిటిషన్ వేసింది ఆమె. వాదోపాదాలు విన్న కోర్టు తాత్కలిక బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈడీ కస్టడీ కాగానే బెయిల్ పై కవిత అణిముత్యంలా తిరిగి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కానీ.. కోర్టు రిమాండ్ విదిస్తూ తీర్పు చెప్పింది. అయితే, కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. కవితను తీహార్ జైలుకు తరలించి.. అక్కడే విచారణ జరుపుతాతరని అధికార వర్గాలు చెబుతున్నారు.
కవిత నోరు విప్పడం లేదు..
కవిత ఈడీ కస్టడీ ముగియడంతో ఆమెను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. జ్యూడీషియల్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందేనని న్యాయస్థానంలో వాదించారు. కవిత విచారణకు సహకరించడం లేదని, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకువెళ్లారు. కేజ్రీవాల్, కవితను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
కడిగిన ముత్యంలా బయటకొస్తా..
కోర్టుకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. తనను తాత్కాలికంగా జైలులో పెట్టొచ్చన్నారు. క్లీన్ చిట్‌తో బయటకు వస్తానని అన్నారు.