Take a fresh look at your lifestyle.

తెలంగాణలో తలసరి అప్పు లక్షాకు పైనే…

0 334

అప్పులు.. అప్పులు.. అప్పులు లేకుండా ఉన్నోళ్లు చాలా అరుదు. అప్పు ఉంటే అదో రకమైన మానసిక వేదన. అయినా అన్నీ తెలిసి తప్పనిసరి పరిస్థితిలో అప్పులు చేస్తుంటాం. మనుషులంటే అప్పులు తెస్తారు. అవసరాలు తీర్చుకుంటారు. మరీ.. ప్రభుత్వాలు కూడా అప్పులు చేస్తాయి.. ఔను.. మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలుగు రాష్ట్రాలు చేసిన అప్పులు వింటే నోరేళ్ల పెట్టాల్సిందే.

తెలంగాణలో అప్పులు..

తెలంగాణ ప్రభుత్వం 2022 వరకు చేసిన అప్పులు అక్షరాల 3 లక్షల 12 వేల కోట్లు చేసింది. నమ్మడం లేదా ఇది నిజం. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పుడు మన అప్పులు ఎంతో తెలిస్తే ఈ బంగారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం  చేసిన అప్పుల గురించి ఆలోచిస్తారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పుడు మన అప్పులు కేవలం 64 వేల కోట్ల అప్పులు మాత్రమే ఉండే. అప్పట్లో తలసరి అప్పు 18 వేలు ఉంటే.. ఇప్పుడు లక్షకు పెరిగింది.

కేసీఆర్ అప్పులు చేసిన అప్పుల తెలంగాణగా మార్చుతున్నారని ప్రతి పక్షలు గోల చేస్తున్నాయి. అప్పులు చేయక పోతే ఎలా..? కేంద్రం అప్పులు చేస్తాలేదా.. మేమే చేస్తున్నామా..? అంటూ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.

గత ఏడాది మార్చి నాటికి తెలంగాణ అప్పులు రూ.2.67 లక్షల కోట్లు కాగా..    మార్చి 2022 నాటికి రూ.3.12 లక్షల కోట్లకు చేరిందని.. ఇలా ఏటా రూ.50 వేల కోట్ల వరకు అప్పులు చేస్తున్నారని ప్రతి పక్ష్లలు మండి పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో అప్పులు.. ఔను జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు మనకంటే ఎక్కువే. ఏపీ అప్పులు రూ. 3 లక్షల 98 వేల కోట్లు ఉన్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.

—- —– ——

2020-2021 బడ్జెట్ లెక్కల ప్రకారం 31 మార్చ్ 2020 నాటికల్లా కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పు రూ. 100,18,120.51 కోట్లుగా ఉంది, ఇదే 2014లో రూ. 55,87,149.33గా ఉండేది. ఒక గవర్నమెంట్ తెచ్చిన అప్పుని వేరే గవర్నమెంట్ తెచ్చిన అప్పుతో పోల్చలేము.  అప్పులనేవీ దేశంలోని ఆర్ధిక అవసరాలు, ఇంతకుముందు తెచ్చిన అప్పులపై వడ్డీ కట్టడం, మారుతున్న ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు వంటి అనేక విషయాలపై ఆధారపడి ఉంటాయి.

—– —– ——-

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking