Take a fresh look at your lifestyle.

దిశ ఎన్ కౌంటర్.. ఆత్మరక్షణ కోసమే కాల్పులు

0 81

జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ రిపోర్టుపై

తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం పిటిషన్

హైదరాబాద్, ఏప్రిల్ 12 (వైడ్ న్యూస్) దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారంలో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టులో తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఆ కమిషన్ నివేదికలో పోలీస్ అధికారులపై పేర్కొన్న అంశాలను సవాల్ చేసింది. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీల ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది.

పోలీస్ అధికారుల సంఘం తరపున అడ్వకేట్ నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ”కమిషన్ల రిపోర్టులు క్రిమినల్ కేసుల్లో వర్తించవు. ఆయా కేసుల్లో సీఆర్పీసీ ప్రొవిజన్స్ ప్రకారమే నడుచుకోవాలని చట్టాలు చెబుతున్నాయి. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ నిజనిర్ధారణ కోసం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. అదో బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథం కాదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking