Take a fresh look at your lifestyle.

ఎన్నికలలో నష్ట నివారణ చర్యల కోసం నామినేటెడ్ పదవులు

0 14

ఎమ్మెల్సీ ఆశావాహులకు చైర్మన్ పదవితో సరి..

రాబోయే ఎన్నికలలో రాజకీయంగా లాభ పడాలని భావించిన ప్రభుత్వం పావులు కదుపుతుంది. నామినేటెడ్ పదవులపై ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నేతలకు గుడ్ న్యూస్ చెప్పడానికి స్పీడ్ ను పెంచింది. ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్న వారిని బుజ్జగించడంలో భాగంగా స్టేట్ లెవల్ చైర్మన్ నామినేటెడ్ పోస్ట్ లు ఇస్తోంది ప్రభుత్వం. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవి రాలేదని పార్టీలు మారితే పార్టీకి నష్టంగా భావించిన బీఆర్ఎస్ అధిష్టాన వర్గం నామినేటెడ్ పదవులతో సరి పెడుతుంది.

రాబోయే ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి ఖాయం…?

వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి హామి కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటిలోకి చేరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్, వీజీ గౌడ్ ఎమ్మెల్సీ పదవి కాలం ముగియగానే తమకు ఎమ్మెల్సీ ఇవ్వాలని లైన్ పట్టిన వారిలో అరడజన్ కంటే ఎక్కువే ఉన్నారు.

ఎమ్మెల్సీ పదవి కోసం..

ఆర్మూర్ చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థపాకులు డాక్టర్ మధుశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బీఆర్ ఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం ఆశ పడ్డవారి లిస్ట్ లో ఉన్నారు. అయితే.. డాక్టర్ మధుశేఖర్ కి ఖాయమనే ప్రచారం జరిగింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొనే ప్రతి ప్రోగ్రాంలో అతనిని తన వెంట తీసుకెళ్లడంతో ఆర్డర్స్ రావడమే తరువాయి అన్నట్లుగా వినిపించింది.

డాక్టర్ మధుశేఖర్ కు స్టేట్ చైర్మన్ పదవి..

ఎమ్మెల్సీ పదవికి బదులుగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బి. మధుశేఖర్ ను ప్రభుత్వం నియమించడానికి ఫైల్ సిద్దం చేస్తోంది. గవర్నర్ కోటలో డాక్టర్ మధుశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఖాయమని భావించినప్పటికీ చివరి క్షణంలో ఇతరులకు ఇవ్వాల్సి వచ్చిందని అధిష్టాన వర్గం చెబుతుంది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking