Take a fresh look at your lifestyle.

కరోనాతో భయం లేదు. జాగ్రత్తగా ఉంటే సరి..

0 18

 కోవిడ్ ఇకముందు మరీ ప్రమాదం కాదు..

హైదరాబాద్  మే 10 :  కోవిడ్-19 ఇక ఎంత మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన చెందవలసిన అత్యవసర ప్రజారోగ్య సమస్య కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. దీంతో ఈ వ్యాధి స్థానిక పరిమిత స్థాయికి చేరినట్లు త్వరలో వర్గీకరించే అవకాశం కనిపిస్తోంది. ఓ ప్రదేశానికి లేదా ప్రాంతానికి పరిమితమై, ప్రభావం చూపే వ్యాధిని ఆంగ్లంలో ఎండెమిక్ అని అంటారు. ఈ వ్యాధి ధోరణి దేశవ్యాప్తంగా నిలకడగా ఉంది.

వంటి సబ్ వేరియెంట్లు వ్యాపించే వేగం రేటు ఎక్కువగానే కనిపించింది. అయితే వీటివల్ల సంక్రమించే వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉంది. తెలంగాణా ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీ మహబూబ్ ఖాన్ మాట్లాడుతూ, 2023 మొదటి త్రైమాసికంలో ఎండెమిక్ స్టేజ్ చివరి దశను మనం చూస్తున్నామని చెప్పారు. ఇది త్వరలోనే ఎండెమిక్ అవుతుందని ఈ వైరస్ సైకిల్‌ను బట్టి తెలుస్తోందన్నారు. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు ఉంటాయని తెలిపారు.

డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ కమిటీ ప్రకటన
‘‘కోవిడ్-19 వ్యాధి ఇప్పుడు కొనసాగుతున్న ఆరోగ్య సమస్య, అయితే ఇది పబ్లిక్ ఎమర్జెన్సీ పరిస్థితి కాదు’’ అని 15వ ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఎమర్జెన్సీ కమిటీ సమావేశం తెలిపింది. నిఘాను కొనసాగించాలని, టీకాకరణ ద్వారా రక్షణ కల్పించాలని, ఈ వ్యాధిని సరైన రీతిలో క్లినికల్ మేనేజ్‌మెంట్ చేయాలని, పరిశోధనలకు మద్దతివ్వాలని ప్రపంచ దేశాలను కోరింది.

వ్యూహ రచన
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన కోవిడ్-19 టాస్క్‌ ఫోర్స్ ఈ వ్యాధి స్థానిక పరిమిత దశకు చేరినట్లు ప్రకటించడానికి ఓ వ్యూహాన్ని రచించేందుకు ప్రయత్నిస్తోంది.కోవిడ్-19 ఓ మహమ్మారి అని 2020 మార్చిలో ప్రకటించారు. రెండు వారాల్లోనే 13 రెట్ల కేసులు నమోదయ్యాయి. 2023 మే 10నాటికి దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 22,742 ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking