Take a fresh look at your lifestyle.

నూతన సచివాలయ భవనాన్ని సందర్శించిన హోం మంత్రి

0 15

నూతన సచివాలయ భవనాన్ని

సందర్శించిన హోం మంత్రి

హైదరాబాద్, ఏప్రిల్ 29 : రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయ నూతన భవనాన్ని సందర్శించారు. నూతన సచివాలయ భవనంలోని మొదటి ఫ్లోర్లో ఉన్న హోం శాఖకు కేటాయించిన కార్యాలయాన్ని పరిశీలించారు. ఈనెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయుచున్న నేపథ్యంలో హోంశాఖ కేటాయించిన కార్యాలయాన్ని హోంమంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా సచివాలయ భవనాన్ని సందర్శిస్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ , నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ రవీందర్ రావు , టిఎన్ జి ఓ హైదారాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తదితరులు నూతన సచివాలయ భవన నిర్మాణ విశిష్టతను కొనియాడారు.

ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ…. భారతదేశం లోనే ఇలాంటి సచివాలయ భవనం నిర్మాణం జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకే ఇది సాధ్యమైందనీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్ని సంవత్సరాల్లోనే అద్భుతమైన పరిపాలన అందించడంతోపాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు అవసరమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ను, పోలీస్ కమిషనర్ ,ఎస్పీ కార్యాలయాలను నిర్మించడంతోపాటు ఆధునిక పద్ధతిలో సచివాలయ భవనం నిర్మించడం వల్ల ప్రజలకు అందరు మంత్రులు, అన్ని కార్యాలయాల ఉన్నత అధికారులు ఒకే చోట కలిసి అవకాశం ఉందని తెలిపారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ స్పందిస్తూ…. మన హైదరాబాదులో ఈ రకమైన అతిపెద్ద భవనం నిర్మించడానికి చిత్తశుద్ధి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంకితభావానికి ఇది నిదర్శనం అని కొనియాడారు.

ప్రార్థన మందిర నిర్మాణాలను పరిశీలించిన హోం మంత్రి

ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ నిర్మాణంలో ఉన్న ప్రార్ధన మందిరాలను సందర్శించారు. రెండు మసీదుల స్థలాల నిర్మాణాలను పరిశీలించారు. అదేవిధంగా అక్కడే ఉన్న చర్చిని, దేవాలయాన్ని సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking