Take a fresh look at your lifestyle.

ఎస్కార్ట్ లేకుండానే ప్రశ్నపత్రాల తరలింపు

0 113

ఇంత నిర్లక్ష్యమా..?
ఎస్కార్ట్ లేకుండానే ప్రశ్నపత్రాల తరలింపు

హైదరాబాద్, ఏప్రిల్ 3 (వైడ్ న్యూస్) రాష్ట్రంలో సోమవారం 10వ తరగతి పరీక్షలు  ప్రారంభమయ్యాయి.  సాధారణంగా పరీక్షలకు సంబంధిత ప్రశ్నపత్రాలు స్థానిక  పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచుతారు. పరీక్షకు 30నిమిషాల ముందు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ ప్రొటెక్షన్ తో  ఆ   ప్రశ్న పత్రాలను  జాగ్రత్త గా సెంటర్ లోకి తీసుకువస్తారు.  కానీ హైద్రాబాద్ రాంకోట్ లోని అలెన్ స్కూల్ పరీక్ష సెంటర్ లో  నిర్లక్షంగా కనీస పోలీసు  భద్రత లేకుండా ఒక అటెండర్ తో పోలీస్ స్టేషన్ నుండి కాలి నడక తో పరీక్ష ప్రశ్నపత్రాలు  తెప్పించారు.

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ వ్యవహారం చల్లారాక ముందే మరో ప్రశ్న పత్రాల నిర్లక్ష్యం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం,  పోలీసు వ్యవస్థని విద్యార్దుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. ఇలా ఏలాంటి భద్రత లేకుండా ప్రశ్న పత్రాలు లు కాలి నడకన తీసుకువస్తున్నప్పుడు  దారి మధ్యలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు.  ఒక్క చిన్న నిర్లక్ష్యంతో  పరీక్ష రాసే పిల్లలపై ఎంతో భారం పడుతుందని వారంటున్నారు. ఇలా నిర్లక్యం మళ్ళీ జరగకుండా అటు ప్రభుత్వం ఇటు పోలీసులు చర్యలు తీసుకోవాలని 10వ తరగతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking