Take a fresh look at your lifestyle.

భువనగిరి కలెక్టరేట్ లో కోతుల బెడద

0 12

భువనగిరి కలెక్టరేట్ లో కోతుల బెడద
భువనగిరి:
కోతుల బెడద యాదాద్రి జిల్లా కలెక్టరేట్ కు తాకింది.భువనగిరి శివారు పగిడిపల్లిలోని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ కు నిత్యం వందలాది మంది ఉద్యోగులు, సిబ్బంది, సామాన్యులు వస్తూ పోతుంటారు. పట్టణ శివారులోని జిల్లా కలెక్టరేట్ వద్ద కోతులు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో కలెక్టరేట్ సిబ్బంది, ఉద్యోగులు ఇక్కడికి వచ్చే సామాన్యులు కోతులతో బెంబేలెత్తుతున్నారు. కార్యాలయంలో లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా ఉద్యోగులు, సిబ్బంది జంకుతున్నారు. మహిళా ఉద్యోగులైతే కోతులను చూసి తమ కార్యాలయ తలపులను మూసి వేస్తున్నారు.జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని వరండాల్లో కోతులు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి.

ఎవరి చేతిలో ఏదైనా కనిపిస్తే చాలు మాయం చేస్తున్నాయి. ఈ కోతులు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని భయంతో ఉద్యోగులు, సిబ్బంది వణికిపోతున్నారు. దీంతో కార్యాలయ సిబ్బంది చేతి కర్ర ఉంటేనే బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, సిబ్బంది కర్రలు చేత పట్టుకొని కోతులను తరముతున్నారు. కలెక్టరేట్ వద్ద కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టరేట్ అధికారులకు ఉద్యోగులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లోని కోతుల బెడద అంటే పట్టని అధికారులకు.. ఇప్పుడు కార్యాలయాలకు తాకడంతో తెలుస్తోందని సామాన్యుల అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking