Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను తెలంగాణ సమస్య కాదు

0 281

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను

తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారు

హైదరాబాద్, మార్చి 11 : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారన్నారు తేజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం. కవిత అరెస్ట్ తెలంగాణ ప్రజల సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు నిరుద్యోగం, అధిక ధరలతో సతమతమవుతున్నారన్నారు.

అయినా.. కవిత అంశం తెలంగాణకు ముడిపెట్టడం ఇది అధికార మదం… అహంకారని విమర్శించారు కొదండరాం. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు పాలుపడిన కవిత.. మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్యడం సిగ్గు చేటన్నారు.

సారాయి వ్యాపారంతో కవితకు ఏమీ పని అని ప్రొఫెసర్ కొదండరాం నిలదీసారు. కవిత, అదానీ విషయంలో తేజస ఓకే విధానంతో ఉన్నాం అన్నారు ఆయన. సొంత వ్యాపారుల కోసం అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారని నిలదీసారు. కవితను పార్టీ నుంచి కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు ఆయన.

12న  మలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు ఈ సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పరిస్థితులపై సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం అని వివరించారు కొదండరాం.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking