Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ కవితక్కకు గజమాలతో సన్మానం

0 16

కవితక్కకు గజమాలతో సన్మానం

నిర్దేశం, నిజామాబాద్ :
ఔను.. ఆమె ఎమ్మెల్సీ.. సీఎం కూతురు కూడా..  అంతే.. ఆమె మెప్పు కోసం ఎవరైనా ప్రయత్నాలు చేయాల్సిందే. ఆమె ఆశీర్వాదంతోనే నిజామాబాద్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయడానికి అవకాశం వచ్చిందనేది వారి నమ్మకం.

అయినా.. కవిత చేసిన పోరాటంతో కేంద్రం దిగి వచ్చిందనేది ఆ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు విశ్వషిస్తున్నారు. డాటర్ ఆఫ్ పైటర్ అంటూ కవితక్కను కొనియాడారు.

ఇంకేంది. ఆ కవితక్కను సోమవారం నిజామాబాద్ అర్బన్ కు పిలిపించి ఘనంగా సన్మానం చేసి తన భక్తిని చాటుకున్నాడు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా. గజమాలతో సన్మానం చేసిండు.

కవితక్క నిజామాబాద్ అర్బన్ లో పాదయాత్ర చేసింది. ఆమె వెనుక వేలాది మంది గులాబి జెండాలతో ర్యాలీ తీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూడు గంటలు కవితక్క ఐటీఐ నుంచి పాత కలెక్టరేట్‌ వరకు నడిసింది.

ఎర్రటి ఎండలో నవ్వుతూ బీఆరెస్‌ శ్రేణులతో కలిసి అడుగులు వేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking