Take a fresh look at your lifestyle.

ఈనాడుపై మండి పడ్డ మంత్రి అంబటి

0 65

నైతిక విలువల్లేని వ్యక్తి ‘కన్నా’
: జలవనరుల శాఖమంత్రి శ్రీ అంబటి రాంబాబు

అమరావతి, ఫిబ్రవరి 23, ఈనాడుది నీచమైన జర్నలిజం..కథ ముగిసినటువంటి రాజకీయ పార్టీని ఏదోవిధంగా పునరుజ్జీవనానికి తేవాలనే ప్రయత్నంలో ‘ఈనాడు’పత్రిక పడుతున్న పాట్లు చూస్తుంటే.. నిజమైన జర్నలిస్టులు, జర్నలిజం విలువలు తెలిసిన వారు బాధపడుతున్నారు. ఇదేం జర్నలిజం అంటూ నవ్వుకుంటున్నారు.  ఈనాడు పత్రికలో నిన్న మొదటి పేజీలో బ్యానర్‌ వార్తను ప్రజలంతా చూశారు. అది ఎంత నీచమైన జర్నలిజమో ప్రజలు గమనిస్తున్నారన్నారు రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి శ్రీ అంబటి రాంబాబు.

పొలిటికల్‌ పోర్న్‌స్టార్‌ పట్టాభి
పట్టాభి, లోకేశ్, అయ్యన్నపాత్రుడు లాంటి తెలుగుదేశం నాయకులు తమనోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. పచ్చిబూతులు సైతం మాట్లాడుతున్నాడు. అత్యంత ప్రజాదరణ కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని తప్పుడు మాటలు మాట్లాడతారు. అలా మాట్లాడి అతను ఆనందిస్తారు. మాట్లాడించిన చంద్రబాబు నాయుడు ఆ మాటలకు మరీ ఆనందపడతాడు. అది రాసి మరింతగా ఆనందిస్తాడు ఈనాడు రామోజీరావు. ఒకవిధంగా చెప్పాలంటే, పొలిటికల్‌ పోర్న్‌స్టార్స్ గా వీళ్లని గుర్తించాలి.

నైతిక విలువల్లేని వ్యక్తి ‘కన్నా’
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికను మేము అతి సాధారణ విషయంగానే చూస్తున్నాం. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్‌పార్టీ నాయకుడు. నిన్నటిదాకా బీజేపీ నాయకుడు. ఇప్పుడు టీడీపీ.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ‘కన్నా’కు బాగా అలవాటు. కాంగ్రెస్‌లో పదవులు వెలగబెట్టి బీజేపీలోకి వెళ్లాడు. బీజేపీలో చేరేముందు వైఎస్‌ఆర్‌సీపీలో చేరతానని అన్నాడు. ఢిల్లీ నుంచి ఫోన్‌లు రాగానే గుండెజబ్బు వచ్చిందని ఆస్పత్రికి వెళ్లాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కొన్నాళ్లలోనే అతన్ని అధిష్టానం పక్కనబెట్టింది. ఏదేమైనా.. బీజేపీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టి.. మరలా జనసేనకు వెళ్లేందుకు బేరాలాడాడు. అతని వ్యాపారం పారలేదు. అందుకని, ఇప్పుడు టీడీపీ గూటికి చేరాడు. నైతిక విలువలు కోల్పోయి.. పదవికోసం ఏ పార్టీ కండువానైనా వేసుకునే దిగజారుడు నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ.

ఈరోజు ‘కన్నా’ రాజకీయంగా చచ్చినట్లే..
ఒకప్పుడు ఇదే కన్నా లక్ష్మీనారాయణ ఒక మాట చెప్పాడు. ‘ఈ చంద్రబాబు అనే దుర్మార్గుడు.. నన్ను, వంగవీటి రంగాను ఎలిమినేట్‌ చేయడానికి కుట్ర చేశాడు. రంగాను అడ్డుతొలగించుకున్నారు గానీ.. నన్ను మాత్రం చంపలేకపోయారు..’ అని అందరికీ చెప్పుకున్నాడు. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణకు నేను చెబుతున్నాను. నిన్ను సర్వనాశనం చేయడానికి చంద్రబాబు వ్యూహం పన్నాడు. అతని చేతితో టీడీపీ కండువా వేయించుకున్న క్షణంలోనే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా చచ్చిపోయినట్లేనని చెబుతున్నాను.

ఖబడ్దార్‌ కన్నా.. నోరు అదుపులో పెట్టుకో..
‘నీ రాజకీయ బతుకు కోసం చంద్రబాబు దగ్గరకు వెళ్లావు…అది నీ ఇష్టం.. ఈ ప్రభుత్వానిది దుర్మార్గమైన పరిపాలన.. అని ఏవేవో కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెడతావా..?’ చూడు కన్నా.. నీకు నోటిదూల ఎక్కువని మాకందరికీ బాగా తెలుసు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారిని నోటికొచ్చినట్లు మాట్లాడితే..ఖబడ్దార్‌ .. వళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు. లేదంటే నీకు తగిన బుద్ధి చెబుతాం.

వారాహికి తుప్పుబడుతుందేమో…
వారాహి అని ఒక సెలబ్రిటీ స్టార్‌ అన్నాడు. యాత్రకు బండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. చంద్రబాబు వారాహి రోడ్లపైకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అది తప్పు పట్టి పోతోంది.

ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు, లోకేశ్‌..
ఈ రాష్ట్రంలో ఎన్ని యాత్రలు చేసినా ఫలితం కనిపించడంలేదని చంద్రబాబు, లోకేశ్‌కు ఫ్రస్టేషన్‌ పెరిగి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. తిరిగి వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తండ్రీకొడుకులకు అర్ధమైంది. ఈ దుష్టచతుష్టయానికి తప్ప మా పరిపాలన అందరికీ నచ్చుతుంది. మద్యం ధరలు పెరుగుతున్నాయని చంద్రబాబు తెగబాధ పడిపోతున్నాడు. ఆయన చెబుతున్నట్లు.. మద్యంలో మంచి మద్యం ఏంటో.. ఆయన పాలనలో జనాలకు ఏరకమైన మద్యం పోయించాడో.. ప్రజలకు అంతా తెలుసు. లోకేశ్‌ను ప్రశాంతత అని అనమనండి.. ‘ప్రశాంత అత్త’ అనేవాడు ఈ రాష్ట్రంలో ఒక నాయకుడంట. అధికారం కోసం లోకేశ్ పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని చంద్రబాబుకు ఎవరు చెప్పారు..? బహుశా కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు పార్టీలో చేరతారని బాబు అలా మాట్లాడుతుంటాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking