Take a fresh look at your lifestyle.

సిద్దిపేట్ లో మెపా మెగా జాబ్‌మేళా సక్సెస్‌

0 154

మెపా మెగా జాబ్‌మేళా సక్సెస్‌
హాజరైన 500 మంది ఉద్యోగార్థులు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముదిరాజ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన (మెపా) ఆధ్వర్యంలో సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని న్యూజనరేషన జూనియర్‌ కాలేజీలో శనివారం నిర్వహించిన మెపా మెగా జాబ్‌మేళా విజయవంతమైంది.

ఈ మేళాలో ఐసీఐసీఐ బ్యాంకు, లాంబార్డ్‌, హెచడీఎఫ్‌    సీ బ్యాంకు, కొటాక్‌ మహేంద్ర, ఆటా ఏఐఏ, లాజిస్ర్టిక్‌ సర్వీసెస్‌ అమెజాన, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీప్‌ తదితర సంస్థల ప్రతినిధులు హాజరై ఉద్యోగార్థులకు అక్కడిక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించారు. శనివారం సాయంత్రం పొద్దుపోయే వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతుండగా .. అప్పటికే 250 మందికి ఆఫర్‌లెటర్లు అందజేశారు.

ఈ మెగాజాబ్‌మేళాకు ముదిరాజ్‌ విద్యార్థులే కాకుండా అన్ని వర్గాల విద్యావంతులైన అభ్యర్థులు హాజరయ్యారు. కాగా మెగా జాబ్‌మేళాను స్థానిక వార్డు సభ్యులు నాయకం లక్ష్మణ్‌ ప్రారంభించగా, సభకు మెపా జిల్లా అధ్యక్షుడు పిట్ల ఆంజనేయులు అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని కృష్ణముదిరాజ్‌ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్‌ ముదిరాజ్‌ మాట్లాడారు. కేవలం ముదిరాజ్‌ యువత అభ్యున్నతి కోసమే కాకుండా అన్ని వర్గాల యువతీ, యువకుల బంగారు భవిష్యత్తు కోసం మెపా పాటుపడుతుందని అన్నారు.

రాష్ట్ర చరిత్రలోనే మెపా సిద్ధిపేట జిల్లా కమిటీ తొలిసారిగా మెగా జాబ్‌మేళాను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమం నాంధిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల మెపా కమిటీలు వారి వారి జిలాల్లో జాబ్‌మేళాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.

శనివారం నిర్వహించిన మేళాలో ఉద్యోగాలు కల్పించిన వివిధ సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించి ముదిరాజ్‌ల అభ్యున్నతి కోసం పాటుపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్ధిపేట మునిసిపల్‌ వైస్‌ చైర్మన జంగిటి కనకరాజు ముదిరాజ్‌, తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ బోర్డు సభ్యుడు పాల సాయిరాం, సిద్ధిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన మచ్చ విజితవేణుగోపాల్‌ రెడ్డి, 16వ వార్డు కౌన్సెలర్‌ బర్ల మల్లికార్జున, 32వ వార్డు కౌన్సెలర్‌ బంగారం శ్రీలత రాజు, పట్టణ బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు గాడిచర్ల నరసమ్మ, బార్‌ కౌన్సల్‌ జనరల్‌ సెక్రటరీ మంతూరి సత్యనారాయణ, పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కొండం సంపతరెడ్డి, టైమ్స్‌కో హెచఆర్‌ ఎనరాకేష్‌, జేబీఎం సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking