Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా సక్సెస్

0 15

హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా సక్సెస్

జాబ్ మేళా లో1300 మంది అభ్యర్థులకుజాబ్స్

హైదరాబాద్, జూన్ 4 :  భారత ప్రభుత్వ Ministry of Skill Development and,Entrepreneurship (MSDE) మార్గదర్శకత్వంలో నిపుణ స్వచ్ఛంద సంస్థ సహాయం తో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) నిర్వహించింది.  IT & ITES, రిటైల్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ & ఫైనాన్స్, ఆటోమోటివ్, ఫార్మా మొదలైన రంగాల నుండి 220 కంపెనీలలో ఎంపికైన అభ్యర్థులకు ముగింపు వేడుకలో ఆఫర్ లెటర్‌లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు అందజేశారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నేడు జాబ్ మేళా నిర్వహించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ యువశక్తితో భవ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు యువశక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా సద్వినియోగ పరిచేందుకు అన్నిరకాలుగా కృషిచేస్తోందన్నారు ఆయన.  ఇందులో భాగంగానే అన్ని రంగాల్లో వినూత్నమైన, సృజనాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు కిషన్ రెడ్డి.  భారత దేశ యువతలో శక్తి సామర్థ్యాలు అపారంగా ఉన్నాయి. అందుకే వారి శక్తి సామర్థ్యాలకు నైపుణ్యమనే ఆయుధాన్ని అందించడం ద్వారా అద్భుతాలు సాధించే దిశగా మోదీ సర్కారు పనిచేస్తోందని పేర్కొన్నారు ఆయన.  వచ్చే 25 ఏళ్ళల్లో ప్రపంచాన్ని శాసించేందుకు అవసరమైన అన్ని అస్త్ర, శస్త్రాలను యువతకు అందిస్తోందని వివరించారు రెడ్డి.

యువతకు అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని యువతకు అందించే దిశగా కావలసిన నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  ఈ అవకాశాల్ని సద్వినియోగం చేస్తూ కొత్త ప్రయోగాలు చేస్తూ భారత యువత ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి తద్వారా అన్ని రంగాల ఆర్థిక పురోగతికి బాటలు వేసే దిశగా పని చేయాలి. భారతదేశంలో విద్య, వైద్య, రక్షణ, పరిశోధన తదతర రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఆయారంగాల్లో మరింత పురోగతికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking