Take a fresh look at your lifestyle.

ప్రజలకు సేవా భావంతో వైద్యం అందించాలి

0 79

సేవాభావంతో వైద్యం అభినందనీయం
:సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

హైదరాబాద్, ఏప్రిల్ 7 (వైడ్ న్యూస్) విద్య, వైద్యం పూర్తిగా డబ్బు మయం అయినా ఎస్ ఎల్ జి ఆస్పత్రి యాజమాన్యం వైద్యరంగంలో సేవా భావంతో పని చేయడం అభినందనీయమని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నిజాంపేటలోని ఎస్ ఎల్ జి హాస్పిటల్ వారు ఏర్పాటుచేసిన గోల్డెన్ ఏజ్ హెల్త్ ప్రోగ్రాంను ఆస్పత్రి చైర్మన్ శివరామరాజు సి ఇ ఓ సోమరాజులతో కలిసి ప్రారంభించారు

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలను తక్కువ ధరలకే అందించడం గొప్ప విషయం అన్నారు. మానసికంగా శారీరకంగా సామాజికoగా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ సమాజం ఆరోగ్యవంతమైన సమాజంగా రూపుదిద్దుకుంటుందన్నారు. అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కచ్చితంగా పోటీ చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking