Take a fresh look at your lifestyle.

తల్లి పాలే బిడ్డకు వైద్యం, ఆహారం: కేంద్ర మంత్రి

0 38

తల్లి పాలే బిడ్డకు వైద్యం, ఆహారం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 16 (వైడ్ న్యూస్) తల్లి పాలే బిడ్డకు వైద్యం, ఆహారమని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని పిల్లల ఆరోగ్యమే తల్లులకు మహాభాగ్యమని ఆయన అన్నారు.

అంబర్‌పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట్‌లో జరిగిన హెల్తీ బేబీషో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి.. శిశువుల ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.

దేశంలోని ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారన్నారు. 3 నుంచి 13 నెలల పసిపిల్లలతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లలలను తల్లులు ఎంతో పోటీ తత్వంతో పెంచుతున్నారన్న కిషన్ రెడ్డి..

ఇది చాలా మంచి పరిణామమన్నారు. కొందరు తల్లుల్లు పిల్లలకు డబ్బా పాలు ఇస్తారని.. అయితే తల్లి పాలే పిల్లలకు అమృతమన్నారు. తల్లి పాల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు.

ప్రభుత్వం, సమాజం తరపున తల్లిపాలను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చామన్నారు కిషన్ రెడ్డి. హెల్తీ బేబీ షో సర్టిఫికెట్ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుగా ఉంటుందన్నారు.

‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ కార్యక్రమంలో భాగంగా బాలికల ఆరోగ్యంతో పాటు భ్రూణహత్యలను సైతం తగ్గించారని దీంతో నేడు దేశవ్యాప్తంగా మగపిల్లలతో పాటు ఆడపిల్లల సగటు పెరిగిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking