Take a fresh look at your lifestyle.

ఏఐఎస్ఎఫ్ మహాసభలను జయప్రదం చేయండి

0 54

ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలను జయప్రదం చేయండి

పత్తికొండ : అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా నిర్మాణ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి నజీర్ పిలుపునిచ్చారు. పత్తికొండ చదువుల రామయ్య భవనం నందు మహాసభల కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడాన్ని ఏఐఎస్ఎఫ్ గా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలు ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అమ్మ ఒడి వివిధ రకాల పేర్లతో విద్యార్థులను విద్యార్థులు తల్లిదండ్రులను ఆకట్టుకుని సంవత్సరం గడవకముందే ఆ పథకాలలో కోత విధిస్తామని చెప్పడాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యార్థుల పథకాలను ఎత్తివేస్తే భవిష్యత్తులో మీ ప్రభుత్వం కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటుందన్నారు. గతంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడితే దానిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దుచేసి విద్యార్థులకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్, మండల సహాయ కార్యదర్శి మా భాష, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్, రాజు, రమేష్, విష్ణు, ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking