Take a fresh look at your lifestyle.

‘నిర్దేశం’ సర్వేలో లోక్ సభ ఎన్నికలలో ఫలితాలు..

0 34

లోక్ సభ ఎన్నికల ఫలితాలు..

–  కాంగ్రెస్ కు 8, బీజేపీకి  7,

  – బీఆర్ ఎస్, ఎంఐఎం ఒక్కొక్క స్థానాలలో..

నిర్దేశం, హైదరాబాద్ :

లోక్ సభ ఎన్నకలు.. మే 13న పోలింగ్..  ఈ ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో అనే చర్చ అందట్లో ఉంది. రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలతో బీజేపీ – కాంగ్రెస్ నువ్వా నేనా అనే రీతిలో కొనసాగుతుంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో ఎంఐఎం పోటీ పడుతుంది.  అయితే.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ పడుతున్నాయి.  బీఆర్ ఎస్ ఒక్క ఎంపీ సీటు నైనా కైవసం చేసుకుంటుందా అనేది పార్టీ శ్రేణులలో వినిపించే మాట. ఇంతకు ఈ ఎన్నికలలో ఎవరెవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూద్దాం..

భిన్నంగా ఎన్నికల ప్రచారం..

అసెంబ్లీ ఎన్నికలంటే అదో పండుగ వాతవరణంలా ఉండేది. ఎన్నికలకు ముందు నుంచే ఓటర్లకు బిర్యానీ, మద్యం, డబ్బులు పంపిణీ చేసేవారు. కానీ.. ఈ లోక్ సభ ఎన్నికలు మాత్రం ఆ హడావుడి లేకుండానే కొనసాగుతున్నాయి. జన సమీకరణ కోసం అభ్యర్థులు చేస్తున్న ఖర్చు మినహా ఇతరాత్ర చాలా తగ్గిందని చెప్పొచ్చు. మండుతున్న ఎండలలో ప్రజలు కూడా బయటకు రావడానికి సహసం చేయడం లేదు. ‘నిర్దేశం’ సర్వేలో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజక వర్గాలలో ఎన్నికల పరిస్థితులను పరిశీలిస్తే బీఆర్ ఎస్ వెనుకబడి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుంది. కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ ఎస్ 1, ఎంఐఎం 1 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి.

 పోలింగ్ కు ఒక్క రోజు ముందే..

లోక్ సభ ఎన్నికలలో పోలింగ్ కు ఒక్క రోజు ముందు మద్యం, డబ్బులు పంపీణి చేయాలని పొలిటికల్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే సర్వేలను నమ్ముకున్న ఆయా పార్టీల అభ్యర్థులు ఓటరులకు డబ్బులు పంపీణి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. అయినా.. ఓటర్లు డబ్బులు తీసుకుని కూడా ఏ పార్టీకి ఓటు వేయాలో ముందే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 17 పార్లమెంట్ నియోజక వర్గాలలో హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ గెలుస్తోంది.

ఆదిలాబాద్ లో..

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ – బీజేపీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ ఎస్ ప్రచారంలో కూడా వెనుక బడి ఉంది. కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీ పడుతున్నారు. అయితే.. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఖాయంగా వినిపిస్తోంది. ఈ ముగ్గురు కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి రావడం విశేషం.

నిజామాబాద్ లో..

నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ – బీజేపీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాల్, మెట్ పల్లి, కోరుట్ల ప్రాంతాలలో పరిచయం ఉన్న సీనియర్ నాయకుడు. అతనికి నిజామాబాద్ జిల్లాతో అంతగా పరిచయం లేదు. బీజేపీ అభ్యర్థి గా సిట్టింగ్ ఎంపీ అరవింద్ పోటీ చేస్తున్నారు. పసుపు బోర్డును తెప్పించడంతో రైతులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల బరిలో ఉన్నారు. అతని ప్రభావం అంతగా కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి అరవింద్ కు గెలుపు అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

కరీంనగర్ లో..

కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీ అసక్తిగా మారింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ కావడం కూడా అతనికి కలిసొచ్చే ఆంశం. కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య పోటీలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు గెలుపు సులువంటున్నారు.

మెదక్ లో.. 

మెదక్ పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిలు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురి మధ్య నువ్వా నేనా అనే రీతిలో కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు లేదా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటున్నారు.

వరంగల్ లో..

వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి డాక్టర్ కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్,  బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ లు పోటీ పడుతున్నారు. అయితే.. బీజేపీ, బీఆర్ ఎస్ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపొందే అవకాశం ఉందంటున్నారు.

పెద్దపల్లిలో..

పెద్దపల్లి నియోజక వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా పేరుంది. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ వెంకటస్వామి ఫ్యామిలీకి ఈ నియోజక వర్గ ప్రజలతో మంచి సంబందాలున్నాయి. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ, బీజేపీ నుంచి గోమాన శ్రీనివాస్, బీఆర్ ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ లు పోటీ పడుతున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మహబూబాబాద్ లో..

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, బీజేపీ అభ్యర్థి ఆజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు అవకాశాలున్నాయంటున్నారు.

మహబూబ్ నగర్ లో..

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో రాజకీయాలు అసక్తిగా మారాయి. బీజేపీ అభ్యర్థి డికె అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, బీఆర్ ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ – కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అనే రీతిలో బలబలాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డికి విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నాగర్ కర్నూల్ లో..

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజక వర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ఇక పోతే.. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి పోతుగంటి భరత్, బీఆర్ ఎస్ నుంచి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ పడుతున్నారు. అయితే.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ మధ్య పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ స్వల్ప ఓట్లతో విజయం సాధిస్తారంటున్నారు.

నల్గొండ లో..

నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూర్ రఘువీర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంది. అయినా.. కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు ఖాయం అంటున్నారు.

ఖమ్మంలో..

ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, బీజేపీ అభ్యర్థి వినోద్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వర్ రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలిచే అవకాశాలున్నాయంటున్నారు.

జహీరాబాద్ లో..

జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బీబీ పటెల్, కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షట్కార్, బీఆర్ ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ పడుతున్నారు. కాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంది. అయితే.. బీజేపీ అభ్యర్థి బీబీ పటేల్ గెలుపొందే అవకాశం ఉందంటున్నారు.

భువనగిరిలో..

భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గంలో  కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంది. ఫైనల్ గా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది.

చేవేళ్లలో..

చేవేళ్ల పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉద్దండులే పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఆర్థికంగా వెనుకాడాని నేతలు కావడంతో ఖరీదైన ఎన్నికలుగా రికార్డు సంపాదించే అవకాశం ఉంది. అయితే.. ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా ఉందంటున్నారు. ఫైనల్ గా బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉందంటున్నారు.

మల్కాజిగిరి లో..

దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజక వర్గమైన మల్కాజిగిరిలో ఎన్నికలు అసక్తిగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి సీటింగ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. కాగా కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతరెడ్డి పోటీ చేస్తుండగా నాన్ లోకల్ అనే పేరుంది. అలాగే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు. బీఆర్ ఎస్ అభ్యర్థి  రాగిడి లక్ష్మారెడ్డిలు పోటీలో ఉన్నారు. అయితే.. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపును ఎవరు ఆపలేరంటున్నారు.

సికింద్రాబాద్ లో..

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మరావు గౌడ్ లో పోటీలో ఉన్నారు. కాగా ఈ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి కావడంతో గట్టి పట్టుంది. అయితే.. బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలున్నయంటున్నారు. అయితే.. ముస్లీంల ఓట్లు అధికంగా ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు విజయవకాశాలు లేక పోలేవంటున్నారు.

హైదరాబాద్ లో..

హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. కానీ.. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ గెలుపు నల్లేరులో నడకలా చెబుతున్నారు. కారణం ముస్లీం ఓటరులు అధిక సంఖ్యలో ఉండటమే కారణం. కాగా బీజేపీ అభ్యర్థి మాధవి లత గట్టి పోటీ ఇస్తోంది. అలాగే బీఆర్ ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహ్మద్ వలీ హుల్లా పోటీలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking