Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీ కవితకు కోట్లు ఇచ్చానని సుప్రీం కోర్టుకు లేఖ

0 79

మరోలేఖ విడుదల చేసిన సుఖేష్ చంద్రశేఖర్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12, (వైడ్ న్యూస్) సుఖేష్ చంద్రశేఖర్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్, సిబిఐ, ఈడీ డైరెక్టర్లకు లేఖ రాసాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆయన సహాయకులు సౌత్ గ్రూప్, కె.కవిత తో జరిపిన లావాదేవీల అంశాన్ని పేర్కొన్న సుఖేశ్.

ప్రజాప్రతినిధులుగా ఎన్నికై, అధికారంలో ఉన్న వ్యక్తులతో పాటు అవినీతిపై వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న వ్యక్తులకు మధ్య జరిగిన చాటింగ్ల స్క్రీన్షాట్ల కాపీలను నేను మీ దృష్టికి తెచ్చాను.
అరవింద్ కేజ్రీవాల్, అతని సహచరులు సౌత్ గ్రూప్, ఇండో స్పిరిట్ దాని యజమానులు అరుణ్ పిళ్లై, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కె కవిత లావాదేవీల అంశాన్ని రుజువు చేస్తుంది.

. ముఖ్యంగా నా నుంచి చేరవేయబడ్డ నగదు అంశం కూడా. ఇది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, కైలాష్ గెహలట్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కె. కవితల నగదు లావాదేవీలు అంశం ఉంది.

2020 లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు తాను నగదు పంపించడం జరిగింది. ఇందుకు సంబంధించి తనకు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు మధ్య జరిగిన సంభాషణలు జత చేస్తున్నాను. అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్లకు చెందిన రూ. 15 కోట్లు హైదరాబాద్లోని BRS పార్టీకి చెందిన కె. కవితకు తనను డెలివరీ చేయమని అడిగారని పేర్కొన్న సుఖేశ్.

ఢిల్లీ లిక్కర్ లైసెన్సుల కోసం కె. కవితతో జరిపిన లావాదేవీలు, కిక్స్ బ్యాక్గా ఉన్న మొత్తాలు ఆమ్ అద్మీ పార్టీకి అనుకూలంగా హైదరాబాద్ నుండి హవాలా ద్వారా వివిధ ఆసియా దేశాలకు లాండరింగ్ చేయబడ్డాయి…బదిలీ చేయబడ్డాయి. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుండి ఎటువంటి లావాదేవీలు నిర్వహించకూడదని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

కోవిడ్ కాలంలో నగదు లావాదేవీలు అన్ని అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ అద్మీ పార్టీ కోసం హైదరాబాద్ నుండి నిర్వహించబడ్డాయి. జోడించిన చాట్ కాపీలలోని కొన్ని వివరాలను నేను ఇందుమూలంగా ప్రస్తావిస్తున్నాను.

అన్ని లావాదేవీల వాయిస్ నోట్స్తో పాటు అన్ని ఇతర చాట్లను కూడా సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పైన పేర్కొన్న సీనియర్ నాయకులు. అప్లికేషన్ను ఎవరి అభ్యర్థన, ఒత్తిడి లేదా కారణంతో కాకుండా సొంత ఇష్టానుసారం రాస్తున్నాను.ఈ అంశంలో మీ జోక్యాన్ని కోరుతున్నాను… దీనిపై వివరణాత్మక దర్యాప్తును ఆదేశించాలని కోరుతున్నానని లేఖలో పేర్కోన్నాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking